Hidden Cameras In Room: రూంలో రహస్య కెమెరాలు.. ఇలా గుర్తించండి..
ABN , Publish Date - Jul 06 , 2025 | 02:27 PM
రహస్య కెమెరాల వల్ల జీవితాలు నాశనమైన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, మీ గదిలో రహస్య కెమెరాలు ఉన్నాయని మీకు అనుమానం ఉందా? వాటిని ఇలా గుర్తించండి..
Hidden Cameras In Room: ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగింది. షాపింగ్ మాల్స్, హోటళ్లు, కార్యాలయాలు సహా ప్రతి చోటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ భద్రతాపరంగా మనకు రక్షణ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కొందరు నేరగాళ్లు స్పై కెమెరాలు ఏర్పాటు చేసి ఇతరులకు తెలియకుండా వీడియోలు తీస్తుంటారు. తర్వాత వారిని బెదిరించి శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఘటనల కారణంగా చాలా మంది జీవితాలు కూడా నాశనం అయ్యాయి. అయితే, మీ గదిలో రహస్య కెమెరాలు ఉన్నాయని మీకు అనుమానం వస్తే వాటిని ఇలా గుర్తించండి..
హోటల్ గదిని తనిఖీ చేయండి:
గదిలోకి వెళ్లినప్పుడు మొత్తం గదిని బాగా పరిశీలించండి. గోడల్లో చిన్న రంధ్రాలు, టీవీ వెనుక, గడియారం, స్పీకర్లు లేదా ఇతర పరికరాలను బాగా చెక్ చేయండి. గదిలోని అన్ని లైట్లు ఆపివేసి మీ ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసి గోడలు, పైకప్పు, ఫ్యాన్, గడియారం వంటి ప్రదేశాలను బాగా గమనించండి. టార్చ్ లైట్ వెలుగులో కెమెరా కనిపిస్తుంది. ముఖ్యంగా దాచిన కెమెరాలను గుర్తించేందుకు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. టార్చ్ లైట్ వేసినప్పుడు కెమెరా లెన్స్ కాంతిని ప్రతిబింబిస్తుంది. దాని వలన కెమెరాను గుర్తించడం సులభం అవుతుంది.
వై-ఫై స్కానింగ్ యాప్‌ల ఉపయోగం:
కొన్ని మొబైల్ యాప్‌లు గదిలో కనెక్ట్ అయిన అన్ని పరికరాలను స్కాన్ చేసి చూపిస్తాయి. సీక్రెట్ కెమెరా డిటెక్టర్ యాప్ ద్వారా మీకు అనుమానం వచ్చిన పరికరాలను గుర్తించవచ్చు. హోటల్ గదులు, బాత్రూం లేదా దుస్తులు మార్చుకునే ప్రదేశాలలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయా లేదా అని శ్రద్ధగా తనిఖీ చేయండి. కెమెరాలు గుర్తిస్తే, పోలీసులకు సమాచారం ఇవ్వండి లేదా హోటల్ సిబ్బందితో మాట్లాడండి.
Also Read:
షాపింగ్ చేస్తున్నారా.. ఈ ముఖ్య విషయాలు గుర్తించుకోండి..
ఒపెక్+ బిగ్ మూవ్.. భారీగా తగ్గనున్న క్రూడాయిల్..!
For More Lifestyle News