Share News

Shoping Tips: షాపింగ్ చేస్తున్నారా.. ఈ ముఖ్య విషయాలు గుర్తించుకోండి..

ABN , Publish Date - Jul 06 , 2025 | 01:32 PM

ఈ రోజుల్లో చాలామంది షాపింగ్ చేసినప్పుడు వారి మొబైల్ నంబర్ అడిగే సాంప్రదాయం ఎక్కువయ్యింది. అయితే, మొబైల్ నంబర్ కచ్చితంగా ఇవ్వాలా? లేదంటే ఏం జరుగుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం..

Shoping Tips: షాపింగ్ చేస్తున్నారా..  ఈ ముఖ్య విషయాలు గుర్తించుకోండి..
Shoping

Shoping Tips: చాలా మందికి షాపింగ్ చేయడం అంటే ఇష్టం. ముఖ్యంగా మహిళలకు షాపింగ్ అంటే చాలు వెంటనే రెడీ అవుతారు. షాపింగ్ చేయడం అనేది ఒక వినోదంగా, ఒత్తిడిని తగ్గించే మార్గంగా భావించేవారు చాలామంది ఉన్నారు. అయితే, ఈ మధ్య కాలంలో చాలామంది షాపింగ్ చేసినప్పుడు వారి మొబైల్ నంబర్ అడిగే సాంప్రదాయం ఎక్కువయ్యింది. అయితే, షాపింగ్ చేసినప్పుడు కచ్చితంగా మొబైల్ నెంబర్ ఇవ్వాలా? అలా ఇవ్వకపోతే ఏం అవుతుంది? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


తప్పనిసరి కాదు

షాపింగ్ మాల్స్‌లో చాలా మంది బిల్ వేసేటప్పుడు మొబైల్ నంబర్ అడుగుతారు. భవిష్యత్తులో ఆఫర్లను లేదా కంపెనీకు సంబంధించిన సమాచారం షేర్ చేయడానికి నెంబర్ తీసుకుంటారు. అయితే, మీరు మొబైల్ నంబర్ ఇవ్వకుండా కూడా మీ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఎవరైనా బిల్లు చెల్లించేటప్పుడు లేదా ఇతర కారణాల కోసం మొబైల్ నంబర్ అడిగితే మీ ఫోన్ నెంబర్ ఇవ్వడం, ఇవ్వకపోవడం మీ ఇష్టం. ఎందుకంటే ఫోన్ నెంబర్ ఇవ్వడం కంపల్సరీ కాదు. మొబైల్ నంబర్ ఇవ్వని కారణంగా షాపు యాజమానులు వస్తువులు ఇవ్వకుంటే అది చట్ట విరుద్ధం అవుతుంది. మీరు వారిపై ఫిర్యాదు చేయవచ్చు.


వినియోగదారుల హక్కులు

భారతదేశంలో వినియోగదారుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం, మీరు మొబైల్ నంబర్ ఇవ్వకపోయినా ఎలాంటి నష్టం ఉండదు. మీకు కావాల్సిన వస్తువులను మీరు కొనుక్కోవచ్చు. అలా ఇవ్వకపోతే మీరు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది

ఫిర్యాదు ఎలా చేయాలి?

  • మీరు 1800-11-4000 లేదా 1915 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

  • consumerhelpline.gov.in వెబ్సైట్‌ ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు.

  • NCH యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

  • ఫిర్యాదు చేసిన తరువాత కూడా మీరు కొన్న వస్తువులు లేదా సర్వీసులు ఇవ్వకపోతే చట్ట ప్రకారం షాప్ యజమానికి శిక్ష పడే అవకాశం ఉంది.


Also Read:

ప్రతిరోజూ నిద్రపోయేటప్పుడు దిండు వాడుతున్నారా? ఈ ఒక్క తప్పుతో ఎన్ని సమస్యలో తెలుసా..!

40 ఏళ్లు దాటిన పురుషులు జిమ్‌లో కసరత్తులతో కండలు పెంచగలరా

For More Lifestyle News

Updated Date - Jul 06 , 2025 | 01:36 PM