Sonu Sood: యువజంటల బంధాలు విచ్ఛిన్నం అవుతోంది అందుకే: సోనూ సూద్
ABN , Publish Date - Nov 27 , 2025 | 10:30 PM
నేటి జమానాలో యువ జంటల బంధాలు క్షణాల్లో విచ్ఛిన్నం అవుతున్నాయి. ఓ కొత్త వ్యక్తి యువత జీవితాల్లో భాగం కావడమే ఇందుకు కారణమని ప్రముఖ నటుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానా స్త్రీపురుషుల బంధాలు బలహీనపడుతున్నాయి. లవర్స్, భార్యాభర్తలు అనే తేడా లేకుండా ఎవ్వరైనా క్షణాల్లో విడిపోతున్నారు. ఈ విషయంపై ప్రముఖ నటుడు సోనూ సూద్ తాజాగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘నేటి జమానాలో జనాలకు చాలా విషయాలు తెలిసిపోతున్నాయి. ఇంటర్నెట్ నిత్యం ఏదో ఒకటి ఇస్తోంది. జనాల దృష్టి మళ్లించే అంశాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబానికి కేటాయించే సమయం తగ్గిపోతోంది. మొబైల్ ఫోన్ అనే కొత్త వ్యక్తి మన జీవితాల్లోకి వచ్చారు. తమది కాని ప్రపంచంలో జనాలు ఎక్కువ సమయం గడిపేస్తున్నారు’ అని సోనూ సూద్ అన్నారు (Sonu Sood On Relationships).
‘జనాలకు సహనం తగ్గిపోతోంది. ఒకరు చెప్పేది మరొకరు సహనంగా వినడం తగ్గిపోతోంది. ఎదుటి వారు చెప్పేది వినలేకపోవడం నిజంగా దురదృష్టకరం. కాబట్టి ఫోన్‌లను పక్కన పెట్టి అవతలివారు చెప్పేది జాగ్రత్తగా వినాలి. అవతలి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలి. అలా చేస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి’ అని అన్నారు.
నిత్యం డిజిటల్ ప్రపంచంలో మునిగిపోవడం బంధాల్ని చాలా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవతలి వారిపై ఆధారపడటం, పవర్ బ్యాలెన్స్, బంధాలపై అదుపు వంటివన్నీ తగ్గిపోతాయని అంటున్నారు. జంటల మధ్య మాటలు కూడా తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఏ బంధమైనా బలపడాలంటే మనసులోని భావాలను పంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పరస్పర గౌరవమే బంధాలకు బలమైన పునాదులు వేస్తాయని చెబుతున్నారు. కాబట్టి, ఆలుమగల మధ్య అయినా, ప్రేమికుల మధ్య అయినా మానసిక బంధం పెనవేసుకోవాలంటే ముందు సెల్‌ఫోన్‌లను పక్కనపెట్టాలి. కాసేపు మనసు వప్పి మాట్లాడుకోవాలి. సాధకబాధకాలు ఏమైనా ఉంటే చెప్పుకోవాలి. అప్పుడే మానసికంగా జంటలు దగ్గరకాగలుగుతాయి.
ఇవి కూడా చదవండి:
విమాన ప్రయాణికులకు అలర్ట్.. మీ లగేజీకి ఇలాంటి తాళం మాత్రం వేయొద్దు
పర్యటనలపై వెళ్లే భారతీయులు అత్యధికంగా మర్చిపోయే వస్తువులు ఏవో తెలుసా