Air Travel Suitcase: విమాన ప్రయాణికులకు అలర్ట్.. మీ లగేజీకి ఇలాంటి తాళం మాత్రం వేయద్దు
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:41 PM
విమానాల్లో ప్రయాణించే వారు తమ లగేజీకి ఎట్టి పరిస్థితుల్లో సాధారణ తాళాలు వేయొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎందుకో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి తమ సూట్ కేసులకు చిన్న చిన్న తాళాలను వేసుకుంటారు. ఇలా చేస్తే లగేజీ భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని భావిస్తుంటారు. విమాన ప్రయాణికులు మాత్రం ఇలా ఎన్నడూ చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. దీని లగేజీకి రక్షణ లేకపోగా ఇతరత్రా సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు (Air travel- Padlocks).
నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఈ సాధారణ తాళాలను తెరవడం చాలా సులభం. కాస్త మన్నికైన వాటిని కొన్నా కూడా రక్షణ ఆశించిన మేర ఉండదు. కాబట్టి వీటితో భద్రత ఎక్కువన్న భావన తప్పు.
అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సెక్యూరిటీ చెకింగ్స్ సమయంలో ఈ తాళాలతో సమస్యలు ఎక్కువవుతాయి. టీఎస్ఏ గుర్తింపు లేని తాళాలను కట్ చేసే అధికారం అధికారులు ఉంటుంది. దీంతో, మార్గమధ్యంలోనే వీటిని కోల్పోవాల్సి ఉంటుంది.
ఇలాంటి తాళాల వల్ల దొంగల దృష్టి ప్రయాణికులపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఎయిర్‌పోర్టులు, హోటల్ లాబీల్లో కాచుకుని కూర్చొనే కిలాడీలు ఈ తాళాలున్న లగేజీని టార్గెట్ చేసే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి, బయటకు అంతగా కనబడని సెక్యూరిటీ ఫీచర్స్‌ను ప్రయాణికులు ఎంచుకోవాలి.
ఇలాంటి తాళాలను టచ్ చేయకుండానే లగేజీని తెరిచి విలువైన వస్తువులను తర్కించే అవకాశం ఉంది. జిమ్ ఉన్న లగేజీలకు ఈ ప్రమాదం ఎక్కువ.
కాబట్టి విమాన ప్రయాణాలు చేసే వారు తమ లగేజీకి సాధారణ తాళాల బదులు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు ఉన్న లగేజీని ఎంచుకోవాలి. టాంపరింగ్‌కు సాధ్యం కాని జిప్స్ ఉన్న బ్యాగులను కొనుక్కోవాలి. లగేజీని లాక్ చేసుకునేందుకు కేబుల్ టైలను ఎంచుకోవచ్చు. వీటిని కట్ చేస్తే సులువుగా తెలిసిపోతుంది. లగేజీ స్ట్రాప్స్, కాంబినేషన్ లాక్స్ ఉన్న సూట్‌కేసులను ఎంచుకోవడం మరింత ఉత్తమం. ఇక విలువైన వస్తువులను ప్రయాణికులు చెకిన్ లగేజీకి బదులుగా క్యాబిన్ బ్యాగ్‌లో పెట్టుకోవాలి. ప్రతి బ్యాగ్‌ను సులువుగా గుర్తించగలిగేలా స్పష్టమైన లేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలి. లగేజీల్లో ట్రాకర్‌ను ఏర్పాటు చేసుకుంటే అవి పోయినప్పుడు ఎక్కడున్నాయో సులువుగా గుర్తించొచ్చు. చెకిన్‌కు ముందు లగేజీని ఫొటో తీసుకుంటే చట్టపరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఇవి అక్కరకు వస్తాయి. బయటివైపు పాకెట్స్ లేని బ్యాగులను ఎంచుకోవాలి.
ఇవి కూడా చదవండి:
పర్యటనలపై వెళ్లే భారతీయులు అత్యధికంగా మర్చిపోయే వస్తువులు ఏవో తెలుసా
టూర్‌లపై వెళ్లే వారు తమ సూట్‌కేసుల్లో పెట్టకూడని వస్తువులు ఇవీ