Mosquito Control Tips: ఈ సింపుల్ టిప్స్‌తో దోమలకు చెక్.!
ABN , Publish Date - Nov 10 , 2025 | 10:49 AM
ప్రతి సీజన్‌లోనూ దోమల ముప్పు ఉంటుంది. ఈ దోమలు చికాకు కలిగించడమే కాకుండా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయి. మరి వీటికి ఎలా చెక్ పెట్టాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి సీజన్‌లోనూ దోమల ముప్పు ఉంటుంది . ముఖ్యంగా సాయంత్రం వేళల్లో చాలా ఎక్కువగా సంచరిస్తుంటాయి. దోమ కాటు కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. అందుకే.. ప్రజలు ఆ దోమల బారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దోమలను తరిమికొట్టడానికి కాయిల్స్, స్ప్రేలు వంటి కెమికల్ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ, ఈ ఉత్పత్తులను ఉపయోగించడం అంత క్షేమం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపాటి చిట్కాలతోనే ఇంట్లోంచి దోమలను తిరియేచ్చని సూచిస్తున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేప ఆకుల నీరు..
వేప ఆకులను నీటిలో మరిగించండి. నీరు చల్లారిన తర్వాత, దానిని వడకట్టి స్ప్రే బాటిల్‌లో పోయాలి. ఈ స్ప్రేను ఇంటి మూలల చుట్టూ, ఇంటి వెలుపల, బాత్రూమ్ చుట్టూ స్ప్రే చేయండి. ఇలా చేయడం ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.
తులసి, పుదీనా మొక్కలు..
తులసి, పుదీనా మొక్కల ఘాటైన వాసన దోమలకు ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే.. ఈ వాసన ఉన్న చోటకు దోమలు పెద్దగా రావు. ఇంట్లో పలుచోట్ల కుండీలలో తులసి, పుదీనా మొక్కలను నాటండి. దీని వలన దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
నిమ్మకాయ, లవంగాలు..
ఒక నిమ్మకాయను సగానికి కోసి.. దానికి 5 నుండి 6 లవంగాలు పెట్టండి. దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వలన దోమలు ఇంట్లోకి రావు.
వేప నూనె:
ఆయుర్వేదంలో శతాబ్దాలుగా వివిధ వ్యాధుల చికిత్సకు వేపను ఉపయోగిస్తున్నారు. ఇది దోమలను తరిమికొట్టడంలో కూడా సహాయపడుతుంది. వేప నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల వేప నూనె కలిపి చర్మానికి పూయడం వల్ల దోమలు దూరంగా ఉంటాయి.
వెల్లుల్లి..
వెల్లుల్లి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా దోమలను తరిమికొట్టడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ కంటెంట్ దోమలపై విషపూరితంగా పని చేస్తుంది. దాని ఘాటైన వాసన దోమలను తరిమికొట్టడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దోమలను వదిలించుకోవడానికి.. కొన్ని వెల్లుల్లి రెబ్బలను నీటిలో ఉడకబెట్టాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి ఇంటి చుట్టూ పిచికారీ చేయాలి. ఇలా చేస్తే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.
కర్పూరం..
కర్పూరం ఘాటు వాసన వస్తుంది. ఈ వాసనకు తట్టుకోలేక దోమలు పారిపోతాయి. అందుకే సాయంత్రం వేళల్లో దోమలు తిరుగుతున్నప్పుడు కర్పూరం కాల్చండి. దాని పొగ, వాసన దోమలను పారిపోయేలా చేస్తాయి.
Also Read:
వరుసగా 30 రోజుల పాటు దానిమ్మ కాయ తింటే.. లాభమా? నష్టమా?
తోటకూర వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..
For More Latest News