Saving Tips: ఖర్చులు ఎక్కువైయ్యాయా.. ఈ మ్యాజిక్ ఫార్ములా పాటిస్తే జేబులో ఎప్పుడూ డబ్బే..!
ABN , Publish Date - Jun 26 , 2025 | 06:16 PM
నెలాఖరులో డబ్బు మిగలడం లేదా? ఖర్చులు ఎక్కువైయ్యాయా? అయితే, ఈ మ్యాజిక్ ఫార్ములా పాటిస్తే మీ జేబులో డబ్బు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి, ఆ నియమం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Saving Tips: చాలా మంది నెలకు వేలకు వేలు సంపాదిస్తారు. కానీ, నెలాఖరకు వచ్చేసరికి జేబులో డబ్బు మిగలదు. అంతగా ఏం ఖర్చు చేశామా అని అప్పుడు ఆలోచిస్తూ తలపట్టుకుంటారు. అయితే, ఈ మ్యాజిక్ ఫార్ములా పాటిస్తే మీ జేబులో డబ్బు ఎప్పుడూ ఉంటుంది. డబ్బు లేకుండా మీరు మళ్లీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి, ఆ ఫార్ములా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
'40-30-20-10' ఫార్ములా
40-30-20-10 అనేది ఒక ఆర్థిక ఫార్ములా. మీ ఆదాయాన్ని నాలుగు భాగాలుగా విభజించి, ప్రతి భాగాన్ని ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కేటాయించాలి. సాధారణంగా, ఈ ఫార్ములాలో 40% అవసరాల కోసం, 30% పొదుపులు, పెట్టుబడుల కోసం, 20% అప్పుల కోసం,10% వినోదం కోసం ఉపయోగిస్తారు.
40% అవసరాల కోసం:
ఇంటి అద్దె, EMI, ఆహారం, రవాణా, విద్యుత్, నీరు, గ్యాస్, ఇంటర్నెట్ వంటి యుటిలిటీ సేవల కోసం, చెల్లించాల్సిన బిల్లులు, పిల్లల స్కూల్ ఖర్చుల కోసం మీ జీతంలో నుండి 40% తీసిపెట్టాలి.
30% సేవింగ్స్ కోసం:
మీ ఆదాయంలో 30% సేవింగ్స్ కోసం తీసిపెట్టాలి. ఇది మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి, అత్యవసర ఖర్చుల కోసం లేదా పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగించాలి.
20% అప్పుల కోసం:
క్రెడిట్ కార్డ్ బకాయిలు, లోన్ వంటి అప్పులను తీర్చడానికి మీ ఆదాయంలో నుండి 20% పక్కన పెట్టాలి.
10% వినోదం కోసం:
సినిమాలు చూడటం, రెస్టారెంట్‌లో తినడం, షాపింగ్ చేయడం వంటి వినోద కార్యకలాపాల కోసం ఆదాయంలో నుండి 10% తీసి పెట్టుకోవాలి.
ఈ ఫార్ములా ఎలా ఉపయోగపడుతుంది?
ఆర్థిక క్రమశిక్షణ:
ఇది మీ ఆదాయాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి, అనవసరమైన ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుంది. పొదుపులు, పెట్టుబడులపై దృష్టి పెట్టడం ద్వారా మీరు ఆర్థిక లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు. అప్పులను తగ్గించడం ద్వారా మీరు ఆర్థిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ ఫార్ములా దాదాపు అందరికీ ఉపయోగపడుతుంది. మీరు మీ వ్యక్తిగత అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా ఈ ఫార్ములాలో మార్పులు చేసుకోవచ్చు. మీరు మీ ఆదాయంలో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా కూడా ఇవ్వవచ్చు. ఈ ఫార్ములాను ఉపయోగించే ముందు మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం.
Also Read:
మంగళసూత్రం నుండి గాజుల వరకు.. స్త్రీల ఆభరణాల వెనుక ఆరోగ్య రహస్యాలు ఇవే..
రోజూ సంపాదిస్తున్నా రూపాయి కూడా మిగలడం లేదా.. ఈ అలవాట్లే కారణం..
For More Lifestyle News