ఆ మ్యాజిక్ చేసేది ఓ ఎర్రని దారం మాత్రమే..
ABN , Publish Date - Sep 07 , 2025 | 08:50 AM
అక్కడ అబ్బాయి... ఇక్కడ అమ్మాయి... ఇద్దరినీ కలపాలంటే ఏదో మ్యాజిక్ జరగాలి. అలాంటి మూమెంట్ సినిమా ల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఉంటుంది. ఆ మ్యాజిక్ వర్షం, ప్రయాణం, ఆలయం... ఇలా ఎక్కడైనా, ఏ రూపంలో అయినా ఎదురుకావొచ్చు. కానీ చైనాలో మాత్రం ఆ మ్యాజిక్ చేసేది ఓ ఎర్రని దారం. ‘సోల్‌మేట్’తో బంధం పెనేవేసే ఆ ఎర్రని బంధానికి ఆసక్తికరమైన కథ ఉంది.
- ప్రేమకు ఆ‘దారం’
అక్కడ అబ్బాయి... ఇక్కడ అమ్మాయి... ఇద్దరినీ కలపాలంటే ఏదో మ్యాజిక్ జరగాలి. అలాంటి మూమెంట్ సినిమా ల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఉంటుంది. ఆ మ్యాజిక్ వర్షం, ప్రయాణం, ఆలయం... ఇలా ఎక్కడైనా, ఏ రూపంలో అయినా ఎదురుకావొచ్చు. కానీ చైనాలో మాత్రం ఆ మ్యాజిక్ చేసేది ఓ ఎర్రని దారం. ‘సోల్‌మేట్’తో బంధం పెనేవేసే ఆ ఎర్రని బంధానికి ఆసక్తికరమైన కథ ఉంది.
నమ్మకాలు, విశ్వాసాలలో చైనీయుల తరవాతే ఎవరైనా. పుట్టగానే వారి సోల్‌మేట్‌తో కనిపించని ఎర్రని దారం ముడేసి ఉంటుందని వాళ్లు గట్టిగా నమ్ముతారు. చైనీస్ పురాణాల ప్రకారం ఈ ఎర్రని దారం ప్రేమికులను మణి కట్టు దగ్గర బంధించి ఉంచుతుందట. సరైన సమయంలో వాళ్లిద్దరూ ఎదురుపడతారని, వాళ్ల మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకుం టారని అంటారు. ఆధునిక వాలంటైన్‌లాగా వాళ్ల పురాణాల్లో ప్రేమైక దేవుడుగా ‘యూలా’ను పూజిస్తారు. తెల్లని గడ్డం, పొడవాటి కురులతో కురువృద్ధుడిగా యూలాని పేర్కొంటారు. ఆయన ఎడమ చేతిలో పద్దుల గ్రంథం, కుడి చేతిలో ఎర్రని పట్టు దారాల గుత్తి ఉంటుంది. ప్రేమికులు ఒకరికొకరు దూరమై పోకుండా దారంతో ముడేసి యూలా వాళ్లని కలుపుతాడని చైనీయులు విశ్వసిస్తారు.
ప్రేమ దేవతగా...
తాంగ్ రాజ్య పరిపాలన సమయంలో యూలాకు సంబంధించి ఓ కథ బాగా ప్రాచుర్యంలో ఉంది. ఊరి చివరన ఒంటరిగా కూర్చుని ఓ వృద్ధుడు వెన్నెల రాత్రిలో ఓ పుస్తకం చదువుతుంటాడు. ఆయన దగ్గరకి ఓ యువకుడు వచ్చి, ఏం చేస్తున్నావని ప్రశ్నిం చాడట. దానికాయన ‘పైలోకంలో ముడిపడిన జంటల ‘పెళ్లిళ్ల గ్రంథం’ చదువుతున్నాన’ని జవాబు చెబుతూ, ‘పద్నాలుగు ఏళ్ల తరవాత నీకు పెళ్లి అవుతుంది. కూరగాయలు అమ్మే వాడి కూతురు నీ భార్య. ఆమెకి ఇప్పుడు మూడేళ్లు, ఫలానా ఊర్లో పెరుగుతోంది’ అని తెలిపాడట. ఆ యువకుడికి అది నచ్చక, అదంతా నిజం కాకూడదని ఆ చిన్నారిని చంపేందుకు కొందరు దుండగులను పంపించాడట. పదిహేనేళ్ల తరవాత అతడికి పెళ్లి అయ్యింది. భార్య నుదిటిపై గాయంమచ్చ ఉంది.

ఆ గాయం గురించి వాకబు చేస్తే అప్పు డెప్పుడో వృద్ధుడు చెప్పిందంతా నిజమైందని అర్థం అయిందట. ఆనాటి నుంచి ప్రజలు యూలాను ప్రేమదేవతగా ఆరాధించడం మొదలుపెట్టారు. ఆలయాల్లో ఆయన విగ్రహాలను ఏర్పాటుచేశారు. అక్కడ కోరిన కోర్కెలను తీర్చే చెట్లు కూడా మామూలే. పెళ్లి కావాల్సిన యువతీ యువకులు ఎర్రని దారాన్ని ఆ చెట్టుకు కడతారు.
చైనీయులు ప్రేమ దినోత్సవాన్ని ‘చిషి’ పండుగగా జరుపుకొంటారు. ఆరోజు ఆలయాల్లో యూలాను పూజిస్తారు. ఈ పండగహాంకాంగ్, సింగపూర్, మలేషియా, కొరియా తదితర దేశాలకూ పాకింది. ఈ ఏడాది (ఆగస్టు 29న) కూడా చిషీ పండగ సంబరాల్లోమునిగితేలారు చైనీయులు. ఆరోజు అక్కడ పెళ్లిళ్లు కూడా ఎక్కువే జరుగుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అందుకే స్వీటీ (అనుష్క) అంటే గౌరవం..
ఆ రాశి వారికి ఈ వారం అంతా డబ్బే డబ్బు..
Read Latest Telangana News and National News