Tricks To Persuade Others: బెస్ట్ సైకాలజీ ట్రిక్స్.. ఎవరైనా సరే మీరు చెప్పింది చేయాల్సిందే..
ABN , Publish Date - Oct 03 , 2025 | 09:59 AM
మీరు ఎవరినైతే ప్రభావితం చేయాలనుకుంటున్నారో వారితో మంచి రిలేషన్ మెయిన్‌టేన్ చేయండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి.
ఇతరుల్ని ప్రభావితం చేయండిలా..
ఓ మనిషిని ఇంకో మనిషి ప్రభావితం చేయటం అన్నది చాలా కష్టమైన పని. ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే ఇతరుల్ని ప్రభావితం చేసి తమకు కావాల్సింది చేయించుకుంటూ ఉంటారు. మీరు కూడా ఇతురుల్ని ప్రభావితం చేసి, మీకు ఏం కావాలో వారితో చేయించుకుందామని అనుకుంటున్నారా? అయితే, ఇప్పుడు చెప్పబోయే సైకాలజీ టిప్స్ మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి.
మంచి సంబంధం
మీరు ఎవరినైతే ప్రభావితం చేయాలనుకుంటున్నారో వారితో మంచి రిలేషన్ మెయిన్‌టేన్ చేయండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. వారు బాధలో ఉంటే సానుభూతి వ్యక్తం చేయండి. మీరు వారి మేలు కోరుకునే వారు అనుకునేలా ప్రవర్తన ఉండాలి.
చిన్న పనులు చెప్పండి
ఎదుటి వ్యక్తి మీరు చెప్పినట్లు చేయాలంటే మొదటే పెద్ద పెద్ద పనులు వారికి చెప్పకూడదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అందుకే వారు చేసేలా ఉండే చిన్న చిన్న పనులు చెప్పండి. ఇలా చేస్తే వారు మనం చెప్పే పనులు చేయడానికి అలవాటు పడిపోతారు. తర్వాత మనం పెద్ద పనులు చెప్పినా చేస్తారు.
మంచి శ్రోతగా ఉండండి
ఎప్పుడూ మీరు చెప్పిందే వాళ్లు వినాలని అనుకోకండి. వాళ్లు చెబుతున్నది కూడా కాస్త వినండి. ఇతరుల ఫీలింగ్స్, ఎమోషన్స్‌ను అర్థం చేసుకోవాలంటే మనం మంచి శ్రోతలుగా ఉండాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. మధ్యలో ప్రశ్నలు కూడా వేస్తూ ఉండాలి. తాము చెప్పే విషయాలను శ్రద్ధగా వినే వారిని మనుషులు ఎక్కువగా అభిమానిస్తారు.
ముందు ఇవ్వండి
మీరు ఇతరుల్ని ఏదైనా అడిగి తీసుకోవాలంటే ముందు వారికి ఏదైనా ఇవ్వండి. ఎలాంటి కల్మషం లేకుండా వారికి సాయం చేయండి. ఆపదలో ఉంటే ఆదుకోండి. ఇలా చేస్తే అందరూ కాకపోయినా ఎక్కువ శాతం మంది తిరిగి సాయం చేయడానికి చూస్తారు.
ఏం కావాలో స్పష్టంగా చెప్పండి
మీకు ఏం కావాలో ఎదుటి వ్యక్తికి అత్యంత స్పష్టంగా చెప్పండి. అప్పుడే మనం కావాల్సిన దాన్ని వారు సరిగ్గా ఇవ్వగలుగుతారు.
నమ్మకంగా ఉండండి
ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. తరచుగా వారితో టచ్‌లో ఉండండి. మీరు తప్పు చేస్తే ఒప్పుకోండి. మీ మీద మంచి నమ్మకం ఏర్పడితే గౌరవం ఆటోమేటిక్‌గా వస్తుంది. మీరు చెప్పింది చేయాలని, మిమ్మల్ని ఫాలో అవ్వాలని అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Ind-China Flight Service: కుదిరిన అంగీకారం.. భారత్, చైనా మధ్య ఈ నెలాఖరు నుంచీ..
President Murmu At Red Fort Dasara: ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్