Mosquito Repellents: ఇంట్లో దోమల బెడద తట్టుకోలేకపోతున్నారా.. ఈ చిట్కాలతో దరిదాపుల్లోకి రావు.
ABN , Publish Date - May 07 , 2025 | 03:25 PM
Home Remedies For Mosquitoes: రాత్రుళ్లు దోమలు గుంపులు గుంపులుగా మీదకొచ్చి దండయాత్ర చేస్తున్నాయా.. ఇంట్లో నుంచి వాటిని పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారా.. ఈ కింది చిట్కాల్లో ఏ ఒక్కటి పాటించినా వాటి ఆట కట్టు.. ఒక్కటి కూడా ఇంటి పరిసరాల్లోకి రాలేవు.
Natural Remedies For Mosquitoes: వేసవి కాలంలో దోమల బెడద పెరుగుతుంది. ముఖ్యంగా వర్షం పడినపుడు. ఇంటి లోపల, వెలుపల దోమలు వేగంగా వ్యాపిస్తాయి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా డెంగ్యూ, మలేరియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో దోమల నివారణ జెట్లు, ఆలౌట్లు రోజంతా పెట్టడం వల్ల పిల్లల్లో శ్వాసక్రియ దెబ్బతిని ఊపిరితిత్తులకు హానికరంగా మారుతుంది. కాబట్టి సహజంగా ఇంట్లోంచి దోమలను వెళ్లగొట్టేందుకు ఇంట్లోనే ఈ నివారణలు పాటించండి. తక్షణమే దోమలు, ఈగల బెడద తప్పి ఉపశమనం కలుగుతుంది. దోమలను తరిమికొట్టేందుకు ఎన్నో చిట్కాలున్నాయి. ఈసారి ఈ కింది ఉల్లిపాయ చిట్కాను కూడా ప్రయత్నించి చూడండి. దోమలతో పాటు చిన్న చిన్న కీటకాలు, ఈగలు కూడా పరార్ అవుతాయి.
దోమల నివారణకు ఉత్తమ సహజ చిట్కాలు :
దోమలు కొన్ని రకాల సువాసనలను ఇష్టపడవు. ఈ కింది వాటిన తయారు చేసిన డిఫ్యూజర్ లేదా స్ప్రేని ఉపయోగించండి. వీలైతే కొన్ని చుక్కల నీరు, కొద్దిగా ఆల్కహాల్ కలిపి కూడా స్ప్రే తయారు చేసుకోవచ్చు.
తులసి
వెల్లుల్లి
వేప నూనె
లవంగాలు, నిమ్మకాయ
ఉల్లిపాయ
ఆపిల్ సిడార్ వెనిగర్
యూకలిప్టస్ ఆయిల్
లావెండర్
పుదీనా
ఉల్లిపాయ చిట్కాలు:
దోమలు, ఈగలు ఎక్కువగా కనిపించే మూలల్లో తరిగిన ఉల్లిపాయలను ఉంచండి. ఉల్లిపాయల ఘాటైన వాసనకు దోమలు, ఈగలు ఆ దరిదాపుల్లో కనిపించవు.
ఉల్లిపాయను సగానికి కోసి దానిపై ఆవ నూనెలో ముంచిన వత్తిని వేయండి. తర్వాత కర్పూరం పొడిని వేసి వెలిగించండి. దీని ఘాటైన వాసన దోమలు, ఈగలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. కానీ, ఇళ్లంతా ఉల్లిపాయల వాసనతో నిండిపోతుంది. కావాలనిపిస్తే మీరు ఒకటి లేదా రెండు లవంగాలను కూడా అందులో వేయవచ్చు.
ఉల్లిపాయ, వెల్లుల్లి తొక్కలను పారవేసే బదులు వీటితో దోమల నివారణ మందును తయారు చేయండి. ముందుగా వీటిని నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోండి. కీటకాలు, దోమలు, ఈగలు కనిపించే మూలల్లో ఈ ద్రవాన్ని స్ప్రే చేస్తూ ఉండండి. ఈ పద్ధతి ద్వారా చాలా తేలికగా దోమలు, ఈగలను ఇంట్లోంచి తరిమికొట్టవచ్చు.
Read Also: Air Cooler Tips: ఎయిర్ కూలర్లు వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ప్రాణాలకు ప్రమాదం..
Lizard Bite Symptoms: బల్లి కరిచిన వెంటనే ఏం చేయాలి? దీని వల్ల వ్యక్తి చనిపోతాడా?
House Cleaning Tips: ఈ 3 వస్తువులతో ఇంటిని తుడిస్తే జిడ్డు మరకలతో పాటు కీటకాలు