Share News

Lizard Bite Symptoms: బల్లి కరిచిన వెంటనే ఏం చేయాలి? దీని వల్ల వ్యక్తి చనిపోతాడా?

ABN , Publish Date - May 06 , 2025 | 08:58 PM

Lizard Bite Treatment: ఇంట్లో బల్లులు ఎక్కడపడితే అక్కడ తిరుగుతుంటాయి. గోడలపై పాకుతూ హఠాత్తుగా మీదపడి కరిచినా కరవచ్చు. అప్పుడు ఎలా స్పందించాలి? దీని కాటు ప్రాణాంతకమా? అపోహేనా? ఏది నిజం?

Lizard Bite Symptoms: బల్లి కరిచిన వెంటనే ఏం చేయాలి? దీని వల్ల వ్యక్తి చనిపోతాడా?
Lizard Bite Symptoms

Lizard Bite Symptoms: దాదాపు ప్రతి ఇంట్లో ఇంట్లో బల్లులు ఎక్కడపడితే అక్కడ తిరుగుతూనే ఉంటాయి. ఇవంటే చాలామందికి భయం, అసహ్యం కూడా. ఇవి పొరపాటున మీదపడతాయేమో.. కరుస్తాయేమో అని తెగ కంగారు పడిపోతుంటారు. ఇదిలా ఉంటే బల్లి మన భుజాలపై పడితే ఆయుష్షు తగ్గిపోతుందని ఒక సామెత ఉంది. కానీ అది ఎంతవరకు నిజమో చాలామందికి తెలియదు. అందుకే బల్లుల పేరు విన్నా.. వాటిని ప్రత్యక్షంగా చూసినా వణికిపోతుంటారు.ఇంతకీ, బల్లి మనిషిని కరిస్తే ఏమవుతుంది? ఎలాంటి చికిత్స ఇవ్వాలి? నిజంగా ఇంత చిన్న జీవి కాటుకు మనిషి ప్రాణాలు పోతాయా?. వాస్తవాలు, పురాణాలకు మధ్య తేడాలేంటి? సైన్స్ ఏమి చెబుతుంది? ఇక్కడ తెలుసుకుందాం.


ఇంట్లో ఎవరున్నా లేకపోయినా బల్లులు మాత్రం మన రూంమేట్స్ గా ఉంటాయి. ఇవి దూరదూరంగా ఉంటూ కీటకాలు తిన్నంత వరకూ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, గోడలపై వస్తువుల పాకుతూ , వేలాడుతూ ఏ క్షణంలోనైనా పడిపోతుందేమో అనిపించినపుడే మనసులో భయాందోళనలు మొదలవుతాయి. ఎందుకంటే, రాత్రి పడుకున్న తర్వాతే ఇవి ఎక్కువగా కీటకాల వేటకు దిగుతాయి మరి. ఆ సమయంలో పొరపాటున మీదపడితే.. పడ్డాక కరిస్తే ఏమవుతుంది. తర్వాత శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.


బల్లి విషపూరితమైన జీవా?

బల్లులు పరిమాణంలో చిన్నవి. బలహీనమైన దవడలను కలిగి ఉంటాయి. చూసేందుకు భయంకరమైన జీవుల్లాగే కనిపిస్తాయి. కానీ, అదేపనిగా మనుషుల దగ్గరికి వెళ్లి కాటు వేయవు. తనను తాను రక్షించుకునే క్రమంలోనే కొరుకుతాయి. అయినా ఇది కరిస్తే విషపూరితం కాదు. ఇవి విషాన్ని ఉత్పత్తి చేయవు. ఎటువంటి ఆరోగ్య ప్రమాదాన్ని కలిగించవు. ఇంకా చెప్పాలంటే దోమలు, బొద్దింకలు, ఇతర కీటకాలను తిని మన ఇళ్లను సురక్షితంగా ఉంచుతాయి. ఇక కరిస్తే మనుషులు చనిపోరు. బల్లులు సిగ్గుపడే, దూకుడు తత్వం లేని జీవులు. ఇవి ఆత్మరక్షణ కోసం మాత్రమే కొరుకుతాయి. వీటిలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు.


బల్లి కరిస్తే ఏమి చేయాలి?

బల్లి కరిస్తే గాయాన్ని వెంటనే సబ్బు నీటితో శుభ్రం చేయండి. గాయానికి యాంటీసెప్టిక్ క్రీమ్ రాయండి. వాపు, ఎరుపు లేదా జ్వరం వంటి ఇన్ఫెక్షన్ సంకేతాలు కనిపిస్తేనే వైద్యుడిని సంప్రదించండి. కొన్ని సంస్కృతులలో బల్లిని శకునంగా భావిస్తారు. కానీ చాలా మంది పరిశోధకులు బల్లి లాంటి మంచి జంతువు లేదని వాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 6,000 కంటే ఎక్కువ బల్లుల జాతులు ఉన్నాయి. చాలా బల్లులు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతాయి. కాబట్టి వారిని హింసించకండి. దాని వల్ల ఎటువంటి హాని ఉండదు.


Read Also: House Cleaning Tips: ఈ 3 వస్తువులతో ఇంటిని తుడిస్తే జిడ్డు మరకలతో పాటు కీటకాలు అన్నీ పరార్..

Make Up Brush: మీ మేకప్ బ్రష్‌ మురికిగా ఉందా.. ఇలా శుభ్రం చేయండి..

Beauty Tips: రాత్రి పడుకునే ముందు ముఖానికి ఈ జెల్ రాస్తే.. ప్రకాశవంతమైన మెరుపు మీ సొంతం..

Updated Date - May 06 , 2025 | 09:09 PM