Modern Love Culture : ఓర్ని.. ఈ దేశంలో ఒక్కో అబ్బాయికి 5 గర్ల్ ఫ్రెండ్స్..
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:37 PM
ఒకేసారి ఇద్దరు ముగ్గురితో రిలేషన్లో ఉంటేనే చాలా వింతగా చూస్తారు. అలాంటిది, ఈ దేశంలో ఏకంగా ఒక్కో అబ్బాయికి 5 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారట.
ఇంటర్నెట్ డెస్క్: ఒకేసారి ఇద్దరితో రిలేషనల్‌లో ఉంటేనే మోసం చేశాడంటూ మన వాళ్లు నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేస్తారు. ఇక, ముగ్గురితో రిలేషన్లో ఉంటే వాడిని ఉతికి ఆరేస్తారు. అలాంటిది, ఈ దేశంలో ఒక్కో అబ్బాయికి ఏకంగా 5 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారట. అలా ఎంత మందితో ఉన్న పర్లేదు అన్నట్టు ఉంటారట. ఇంతకు, ఆ దేశం ఏంటో? వారు అలా ఎందుకు ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర యూరప్‌లోని లాట్వియాలోని పద్ధతులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. లాట్వాయాలో జనాభా విషయానికొస్తే.. అక్కడ పురుషుల కంటే మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందట. 100 మంది మహిళలు ఉంటే పురుషుల జనాభా మాత్రం 85 - 87 మధ్యలో ఉంటుంది. దీనివల్ల అక్కడ రిలేషన్స్ చాలా భిన్నంగా ఉన్నాయట.
ఇక్కడి అమ్మాయిలు చదువు, ఉద్యోగం, కెరీర్ తోపాటు రిలేషన్షిప్ల విషయంలో కూడా చాలా ఓపెన్ మైండెడ్‌గా ఉంటారట. అందుకే వారి పార్టనర్ విషయంలో కూడా చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తారట. ఓ నివేదిక ప్రకారం, లాట్వియాలో ఒక అబ్బాయికి నలుగురు నుంచి ఐదు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా తప్పు కాదట. అక్కడి ప్రజలు కూడా దానిని మోసం కింద చూడరట. అదే ఇండియాలో అయితే ఒకరితో రిలేషన్లో ఉన్నా.. క్యారెక్టర్ లేనట్లుగా చూస్తారు.
లాట్వియాలో పార్టీలు చేసుకోవడానికి ఇక్కడ చాలా బెస్ట్ ప్లేస్‌లు ఉంటాయి. బార్లు, క్లబ్‌లు, కేఫ్‌లు మొత్తం యువతతో నిండి ఉంటాయి. మీరు అక్కడికి వెళ్తే.. వారి రిలేషన్స్ ఎంత ఓపెన్ మైండెడ్‌గా ఉంటాయనేది తెలుస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఇక్కడి జీవనశైలి, రిలేషన్స్ మాత్రం చూసేవారికి కచ్చితంగా వింతగానే ఉంటుంది. ఈ ప్రత్యేకత కారణంగా లాట్వియా ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షిస్తుంది.
Also Read:
ఈ అలవాట్ల వల్ల అమ్మాయిలకు క్యాన్సర్ ప్రమాదం.!
For More Latest News