Loneliness Psycology: ఇలాంటి వారికి మిగిలేది జీవితంలో ఒంటరితనమే
ABN , Publish Date - Dec 20 , 2025 | 10:32 PM
జీవితంలో చేసే కొన్ని అలవాట్లే ఒంటరితనానికి దారితీస్తాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. మరి ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుని సరిదిద్దుకుంటే లైఫ్‌లో అర్థవంతమైన బంధాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో తెలీకుండా చేసే కొన్ని తప్పులే ఒంటరితనానికి కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుంటే జీవితంలో ఈ దుర్భర స్థితిని తప్పించుకోవచ్చు (Loneliness Phychology).
చాలా మందికి దీర్ఘకాలిక భావోద్వేగపూరిత బంధాలు ఏర్పాటు చేసుకోవడం ఒక సవాలుగా మారుతుంది. ఇలాంటి వారు తమ మనసులో మాటను అంత ఈజీగా పంచుకోరు. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వారు ఇలా చేస్తే భాగస్వామికి దూరం కావాల్సి వస్తుంది.
మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పకుండానే అవతలి వారు అర్థం చేసుకోవాలని కొందరు పొరబడుతుంటారు. ఇందుకు విరుద్ధంగా జరిగితే చివరకు అసంతృప్తికి లోనవుతారు. చివరకు కోపం పెరిగి అవతలివారిపై నెపం నెడతారు. చివరకు బంధాలు తెగిపోయి ఒంటరిగా మిగిలిపోతారు.
ఏ బంధమైనా పర్‌ఫెక్ట్ కాదన్న విషయాన్ని కొందరు అర్థం చేసుకోలేరు. చిన్న అసౌకర్యం కలిగినా దూరంగా జరుగుతారు. ఇలాంటి వారికి ఇతరులతో భావోద్వేగ బంధాలు ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టం. చివరకు వీరు ఒంటరిగా మిగిలిపోతారు
కొందరు అవతలివారితో సంభాషణలు జరిపేటప్పుడు తెలియకుండానే పొరపాట్లు చేస్తుంటారు. అవతలి వారు తమ సంతోషం లేదా బాధను పంచుకొనేటప్పుడు సావధానంగా వినకుండా తమ అనుభవాలను సంభాషణల్లో చొప్పిస్తుంటారు. దీంతో, తమ మనసులోని మాట వినేవారు లేరనే భావన అవతలివారిలో కలుగుతుంది. దీంతో, వారు దూరం జరిగే ముప్పు ఉంటుంది.
అనవసర ఆలోచనలు, భయాలు కూడా బంధాలను బలహీనపరుస్తాయి. అవతలి వారి ప్రతి మాటను రకరకాల కోణాల్లో విశ్లేషిస్తూ లేనిపోనివి ఊహించుకుంటూ ఉంటే బంధాలు బలహీనపడతాయి. ఇలా అతిగా ఆలోచించి తమను తామే ఇబ్బంది పెట్టుకునే వారు కూడా చివరకు ఒంటరిగా మారిపోతారు.
ఏ బంధం బలపడాలన్నా నిజాయతీ ముఖ్యం. సమస్యల పరిష్కారానికి ఇదే మూలం. కానీ కొందరు ఎలాంటి వాదనలకు ఇష్టపడక మౌనాన్ని ఆశ్రయిస్తారు. అవతలి వారు హర్ట్ అవుతారేమోనన్న భయంతో మనసులోని మాటను బయటపెట్టరు. ఇలా మనసులోనే అణిచిపెట్టుకున్న భావనలు అసంతృప్తిని రగిలిస్తాయి. మానసిక దూరం పెరిగి బంధాలు తెగిపోతాయి.
కొందరు ఒంటరితనం తమకు రాసిపెట్టుకుని ఉందని బలంగా నమ్ముతారు. దీంతో, అవతలి వారికి దగ్గర అయ్యేందుకు అసలు ఏమాత్రం ప్రయత్నించరు. ఇదీ చివరకు ఒంటరితనానికి దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి ధోరణులను వదిలించుకుంటే లైఫ్‌లో ఒంటరితనం అనేదే ఉండదు.
ఇవీ చదవండి:
వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? లైఫ్‌లో ఒక్కసారైనా ఈ టౌన్‌కు వెళ్లి రావాలి!
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..
For More Lifestyle News