Rent Home: ఇంటిని అద్దెకు ఇస్తున్నారా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి ..
ABN , Publish Date - Jun 17 , 2025 | 02:15 PM
ఖాళీగా ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అలా చేయకపోతే తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి, ముందుగానే ఈ ముఖ్య విషయాలను గుర్తుంచుకోండి.
Rent Home: మీరు మీ ఇంటిని అద్దెకు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లయితే, కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. ఖాళీగా ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు ఈ విషయాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అలా చేయకపోతే తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి, ముందుగానే ఈ ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి.
అద్దెదారుడి వివరాలు
ఇంటిని ఎవరికైనా అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్తి వివరాలు తీసుకోండి. పేరు, చిరునామా, ఉద్యోగం, ఆఫీస్ వివరాలు, గత అడ్రెస్ మొదలైనవి అడగండి. అవసరమైతే, ఆధార్ లేదా పాన్ ఫోటో తీసుకోండి.
అద్దె ఒప్పందం
రాతపూర్వక ఒప్పందం లేకుండా ఇంటిని అద్దెకు ఇవ్వడం మంచిది కాదు. కనీసం 11 నెలల పాటు అద్దె ఒప్పందం రిజిస్ట్రేషన్ చేసుకోండి. అందులో ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు ఎవరు చెల్లించాలి, అలాగే ముందస్తు డిపాజిట్ వివరాలు మొదలైనవన్నీ కూడా స్పష్టంగా ఉండాలే చూసుకోండి.
ముందస్తు డిపాజిట్
ఒకటి లేదా రెండు నెలల అద్దెను ముందస్తు డిపాజిట్ తీసుకోవడం మంచిది. అద్దెదారుడు ఇంటిని వదిలే సమయానికి ఎలాంటి నష్టాలు లేవని చెక్ చేసుకున్నాకే డిపాజిట్ తిరిగి ఇవ్వండి.
ఇంటి నిర్వహణ
ఇంటి నిర్వహణ ఎవరు చూసుకోవాలి? అనే విషయం ముందే మాట్లాడుకోవాలి. చిన్నపాటి మరమ్మతులు (టాప్ లీక్, ట్యాప్ చెడిపోవడం వంటివి) అద్దెదారుడే చూసుకోవాలా? లేక మీరు చూసుకోవాలా? అనే విషయంపై ముందే క్లారిటీగా ఉండాలి.
Also Read:
ఇంట్లో లక్ష్మీ కటాక్షం కోసం.. ఈ అలవాట్లు తప్పక పాటించండి!
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
For More Lifestyle News