Vastu Tips: ఇంట్లో లక్ష్మీ కటాక్షం కోసం.. ఈ అలవాట్లు తప్పక పాటించండి!
ABN , Publish Date - Jun 17 , 2025 | 01:02 PM
ఈ అలవాట్లు చిన్నవే అయినా, రోజూ పాటిస్తే మీ ఇంట్లో శాంతి, ఆనందం, సంపద ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Vastu Tips: ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని, డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండకూడదని కోరుకుంటారు. దీని కోసం కష్టపడి పనిచేయడంతో పాటు, ఇంట్లో సానుకూల శక్తి కూడా ఉండటం ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మీ ఇంట్లొ సంపద, శ్రేయస్సు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయాన్నే స్నానం
వాస్తు ప్రకారం ఉదయాన్నే స్నానం చేసే అలవాటు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ప్రతి రోజు సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేయడం మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇది ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు ఎంతో మేలు చేస్తుందని నమ్ముతారు. కాబట్టి, సూర్యోదయానికి ముందే ఉదయాన్నే స్నానం చేసే అలవాటు చేసుకోండి.
ప్రేమాభిమానాలు
ఇంట్లో శాంతి ఉంటేనే లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి, భార్యాభర్తలు స్నేహపూర్వకంగా ఉండటం చాలా ముఖ్యం. చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు.
పిల్లలు ఉదయం ఏడవకుండా చూడాలి
ఉదయాన్నే చిన్నపిల్లలు ఏడవడం వాస్తు ప్రకారం మంచిది కాదు. కాబట్టి, వాళ్లు సంతోషంగా నవ్వుతూ ఉండేలా చూసుకోవాలి.
రాత్రి మురికి పాత్రలు విడిచిపెట్టొద్దు
రాత్రిపూట వంటగదిలో మురికిగా పాత్రలు వదిలేయకండి. ఎందుకంటే ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. లక్ష్మీదేవి నివసించే ఇంట్లో శుభ్రత చాలా ముఖ్యం. అందుకే పడుకునే ముందు పాత్రలు కడగడం అలవాటు చేసుకోండి.
(NOTE: జ్యోతిష్య నిపుణుల ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఏసీ ఉన్న గదిలో బకెట్‌తో నీళ్లు పెట్టుకోవాలి.. ఇలా ఎందుకో తెలుసా
షాంపూ అవసరం లేదు.. ఈ సహజమైన చిట్కాలు పాటిస్తే చాలు
ఈ ఇద్దరినీ ఎప్పుడూ గౌరవించాలి..
For More Lifestyle News