Kitchen Tips: సబ్బు లేకపోయినా పాత్రలు ఇలా శుభ్రం చేస్తే.. గిన్నెలు తెల్లగా మెరిసిపోతాయి!
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:06 PM
వంటింట్లో గిన్నెలు కడగడానికి చాలా మంది సబ్బు ఉపయోగిస్తారు. అయితే, సబ్బు లేకుండా కూడా పాత్రలను శుభ్రం చేయవచ్చని మీకు తెలుసా? ఈ ఇంటి చిట్కాలతో మీ పాత్రలు తెల్లగా మెరిసిపోతాయి! అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: వంటింట్లో ప్రతి పనికీ చాకచక్యం అవసరం. సులభంగా పనులు పూర్తయ్యేలా చేసే చిట్కాలు మన జీవితాన్ని చాలా తేలికగా మారుస్తాయి. అందులో ముఖ్యంగా పాత్రలు శుభ్రం చేయడంలో సబ్బు అందుబాటులో లేకపోతే ఏం చేయాలో తెలిస్తే పని ఈజీగా అయిపోతుంది. డిష్ వాష్ బార్ లేకపోయినా, ఇంట్లో ఉండే కొన్ని సహజ పదార్థాలతో మీరు పాత్రలు తళతళలాడేలా శుభ్రం చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
బేకింగ్ సోడా
ఇంట్లో సులభంగా లభించే బేకింగ్ సోడా పాత్రల శుభ్రత కోసం అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా గోరువెచ్చని నీటితో పాత్రలను కడగండి. ఆపై బేకింగ్ సోడాను చల్లండి. 5-10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత స్క్రబ్ చేయండి. ఈ విధంగా చేస్తే మీ గిన్నెలు తెల్లగా మెరుస్తాయి.
నిమ్మరసం
నిమ్మకాయలో ఉండే ఆమ్లగుణాలు మురికి పాత్రలను శుభ్రం చేయడంలో సహాయపడతాయి. నిమ్మరసం, బేకింగ్ సోడాను కలిపి ఒక పేస్ట్‌లా తయారుచేసి, మురికి గిన్నెలపై రుద్దండి. కొద్దిసేపు అలాగే ఉంచిన తర్వాత స్క్రబ్ చేస్తే మురికి పూర్తిగా పోతుంది.
బొగ్గు లేదా బూడిద
పాత కాలంలో వంట పాత్రలను కడగడానికి బూడిద లేదా బొగ్గును ఉపయోగించేవారు. ఇప్పటికి కూడా మారుమూల గ్రామాల్లో పాత్రలు కడగడంలో బొగ్గు, బూడిద బాగా ఉపయోగపడుతుంది. బొగ్గును బాగా దంచి వచ్చిన ఆ పొడితో గిన్నెలు కడిగేవాళ్లు లేదా బూడిదతో క్లీన్ చేసేవాళ్లు. పాత్రలపై నీళ్లు చల్లి, వాటితో క్లీన్ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
డిష్ వాష్ బార్ లేకపోయినా ఇంట్లో ఉండే బేకింగ్ సోడా, నిమ్మరసం, బూడద, బొగ్గు లాంటి సహజ పదార్థాలతో పాత్రలను శుభ్రం చేయొచ్చు. ఇవి ఖర్చు తక్కువ, ఆరోగ్యానికి హానికరం కాని చిట్కాలు. ఒకసారి ఈ పద్ధతులు పాటించి చూడండి. మీ వంటింటి పనులు మరింత సులభంగా మారతాయి!
Also Read:
నవంబరు వరకూ ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ఢిల్లీలో GST కౌన్సిల్ 56వ సమావేశం.. పన్ను రేట్లు, సంస్కరణలపై చర్చ
For More Latest News