Kitchen Tips: ఇండక్షన్ స్టవ్ ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నారా? ఈ తప్పు చేయకండి..
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:21 AM
మీరు ఫస్ట్ టైం ఇండక్షన్ స్టవ్ ఉపయోగిస్తున్నారా? అయితే, కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే, ప్రారంభంలో జరిగే తప్పులు ఇండక్షన్ స్టవ్‌కు నష్టం కలిగించవచ్చు లేదా మీకు సమస్యలను సృష్టించవచ్చు. కాబట్టి, ఈ తప్పులు చేయకుండా చూసుకోండి.
ఇంటర్నెట్ డెస్క్: నేటి బిజీ జీవనశైలిలో చాలా మంది ఇండక్షన్ స్టవ్‌ను ఉపయోగించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే, మీరు మొదటిసారి ఇండక్షన్ స్టవ్ ఉపయోగిస్తున్నట్లయితే, కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే, ప్రారంభంలో జరిగే తప్పులు ఇండక్షన్ స్టవ్‌కు నష్టం కలిగించవచ్చు లేదా మీకు సమస్యలను సృష్టించవచ్చు. కాబట్టి, ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.
సరైన పాత్రల ఎంపిక
మీరు ఇండక్షన్ స్టవ్‌ను ఉపయోగించేటప్పుడు, సాధారణ పాత్రలు ఉపయోగించడం మంచిది కాదు. అల్యూమినియం లేదా రాగి పాత్రలు ఈ స్టవ్ మీద పనిచేయవు. మీరు ఇండక్షన్-ఫ్రెండ్లీ పాత్రలు, అంటే స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా ఐరన్ బేస్ పాత్రలను ఉపయోగించడం మంచిది. ఈ పాత్రలు మాత్రమే ఇండక్షన్ మీద సరిగ్గా పనిచేస్తాయి. మీరు అల్యూమినియం పాత్రలు ఉపయోగిస్తే, ఆహారం సరిగ్గా ఉడకకుండా ఉండటమే కాకుండా, ఎక్కువ సమయం కూడా పడుతుంది.
పెద్ద పాత్రలు వాడకూడదు
ఇండక్షన్ స్టవ్‌పై తేలికైన పాత్రలను ఉపయోగించాలి. పెద్ద పాత్రలు వాడినట్లయితే అవి స్టవ్‌పై ఒత్తిడిని పెంచి దాని ఉపరితలం దెబ్బతింటుంది. ఎందుకంటే, ఇండక్షన్ స్టవ్ తేలికైన పాత్రల కోసం మాత్రమే రూపొందించారు.
మంచి బ్రాండ్, నాణ్యత
ఇండక్షన్ స్టవ్ కొనుగోలు చేసే సమయంలో బ్రాండ్, నాణ్యత చాలా ముఖ్యం. కొన్ని సార్లు, డబ్బు ఆదా చేయాలని చౌకైన, స్థానిక బ్రాండ్ల ఇండక్షన్ స్టవ్ కొనుగోలు చేస్తే అవి త్వరగా దెబ్బతింటాయి. అందుకే, మంచి బ్రాండ్ నుండి ఇండక్షన్ స్టవ్ కొనడం ఉత్తమం. అలాగే, వారంటీ ఉండేది చూసుకోండి. వారంటీ ఉంటే, ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినప్పుడు మీరు మరమ్మత్తు చేయించుకునే అవకాశం ఉంటుంది.
ఇండక్షన్ స్టవ్ శుభ్రత
ఇండక్షన్ స్టవ్ శుభ్రపరిచే విధానం కూడా చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజూ దీనిని శుభ్రం చేస్తే, ఇది చాలా కాలం పాటు పనిచేస్తుంది. వంట చేసిన తర్వాత స్టవ్ ప్లగ్ తీసి, కొద్దిగా తడిగా ఉన్న కాటన్ వస్త్రంతో ఉపరితలాన్ని శుభ్రం చేయండి. నీరు లోపలికి వెళ్ళకుండా చూసుకోండి.
మొదటిసారి ఇండక్షన్ స్టవ్ ఉపయోగించడం చాలా కష్టమైన పని కాదు. మీరు పాత్రలను ఎంచుకోవడం, ఇండక్షన్ స్టవ్ శుభ్రత, మంచి నాణ్యత గల బ్రాండ్, ఇండక్షన్ స్టవ్ ఉపయోగించడం వంటి కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా పాటిస్తే, ఇది వంట చేయడానికి చాలా ఈజీ అవుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
చర్మంపై తెల్లని మచ్చలు ఎందుకు వస్తాయి.. ఇది ఒక వ్యాధినా?
గుండెపోటు నివారణలో ఆస్పిరిన్‌కు బదులుగా కొత్త మందు..
For More Latest News