Share News

Winter Bathing Tips: చల్లటి నీరు Vs వేడి నీరు.. శీతాకాలంలో స్నానం చేయడానికి ఏ నీరు మంచిది?

ABN , Publish Date - Nov 13 , 2025 | 08:18 AM

శీతాకాలంలో చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తారు.అయితే, ఈ సీజన్‌లో చల్లటి నీరుతో స్నానం చేయడం మంచిదా లేదా వేడి నీటితో స్నానం చేయడం మంచిదా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Winter Bathing Tips: చల్లటి నీరు Vs వేడి నీరు.. శీతాకాలంలో స్నానం చేయడానికి ఏ నీరు మంచిది?
Winter Bathing Tips

ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలం వచ్చేసింది.. ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ముఖ్యంగా చర్మం ఆరోగ్యాన్ని సంరక్షించడం చాలా ముఖ్యం. చాలా మంది శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుందని, అలసట తగ్గుతుందని నమ్ముతారు. కానీ కొందరు, వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారడం, జుట్టు దెబ్బతింటుందని చెబుతారు. మరి, ఈ సీజన్‌లో స్నానం చేయడానికి ఏ నీటిని ఉపయోగించడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..


వేడి నీటితో స్నానం

వేడి నీటితో స్నానం చేయడం చర్మానికి హానికరం అవుతుంది, ఎందుకంటే అధిక వేడి నీరు చర్మంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇది చర్మాన్ని పొడిగా చేస్తుంది. వేడి నీటితో స్నానం చేస్తే, చర్మం మరింత పగుళ్లను, చర్మ చికాకును ఎదుర్కొంటుంది.


చల్లటి నీటితో స్నానం

శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడటం, రోగనిరోధక శక్తి పెరగడం, ఒత్తిడి తగ్గడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని, మనసును ఉత్తేజపరుస్తుంది. మానసిక, శారీరక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది.

ఏ నీటిని ఉపయోగించాలి?

వైద్య నిపుణుల ప్రకారం, శీతాకాలంలో గోరువెచ్చని నీరుతో స్నానం చేయడం మంచిది. అయితే, స్నానం చేసిన తర్వాత చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్ వాడటం చాలా ముఖ్యం. ఎందుకంటే, శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం కష్టం, కాబట్టి.. గోరువెచ్చని నీరుతో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది.


Also Read:

మీకు హ్యాట్సాఫ్.. స్కూల్ టీచర్‌పై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు..

రికార్డు కనిష్ఠానికి ధరల సూచీ

For More Latest News

Updated Date - Nov 13 , 2025 | 08:18 AM