Indias Retail Inflation: రికార్డు కనిష్ఠానికి ధరల సూచీ
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:35 AM
ఈ అక్టోబరులో వినియోగదారుల ధర ల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు కనిష్ఠ స్థాయి 0.25 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణానికి 2014 జనవరి నుంచి 2012 బేస్ ఇయర్ సిరీస్ అమలులోకి...
గతనెలలో 0.25 శాతానికి తగ్గుదల
దోహదపడిన జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు
వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం
న్యూఢిల్లీ: ఈ అక్టోబరులో వినియోగదారుల ధర ల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు కనిష్ఠ స్థాయి 0.25 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణానికి 2014 జనవరి నుంచి 2012 బేస్ ఇయర్ సిరీస్ అమలులోకి వచ్చినప్పటి నుంచి నమోదైన అత్యల్ప స్థాయి ఇదే. కేంద్ర ప్రభుత్వం ఈ సెప్టెంబరు 22 నుంచి దాదాపు 380 ఉత్పత్తులు, వస్తువులపై జీఎ్‌సటీని తగ్గించడంతో పాటు గతనెలలో కూరగాయలు, పండ్లు, కోడిగుడ్ల ధరలు తగ్గుముఖం పట్టడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. ఈ సెప్టెంబరులో ద్రవ్యోల్బణం 1.44 శాతంగా నమోదు కాగా.. 2024 అక్టోబరులో 6.21 శాతంగా ఉంది.
ఏపీలో 0.25 శాతం.. తెలంగాణలో మైనస్ 1.16 శాతం: జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గతనెలలో ఆహార ధరల ద్రవ్యోల్బణం మైనస్ 5.02 శాతానికి జారుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం మైనస్ 0.25 శాతానికి తగ్గగా.. పట్టణ ప్రాంతాల్లో 0.88 శాతంగా నమోదైంది. రాష్ట్రాలవారీగా చూస్తే, కేరళలో అత్యధికంగా 8.56 శాతంగా నమోదైంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 0.25 శాతంగా, తెలంగాణలో మైనస్ 1.16 శాతంగా నమోదైంది.
రుణగ్రహీతలకు రిలీఫ్!?: రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (+/- 2%) కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి లక్ష్యాన్ని నిర్దేశించింది. గడిచిన కొన్ని నెలలుగా నియంత్రిత లక్ష్యంలోపే నమోదవుతూ వస్తున్న ద్రవ్యోల్బణం.. గతనెలలో రికార్డు కనిష్ఠానికి దిగివచ్చింది. దీంతో వచ్చేనెల 3-5 తేదీల్లో జరగనున్న ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే లక్ష్యంతో ఆర్‌బీఐ కీలక రెపోరేటును మరో 0.25ు తగ్గించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రెపోరేట్లపై నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలే కీలకం. రెపోరేటు తగ్గితే తదనుగుణంగా బ్యాంక్‌లు రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తాయి. ఫలితంగా రుణాలు మరింత చవకగా లభించడంతోపాటు ఇప్పటికే రుణం తీసుకున్నవారికి ఈఎంఐల భారం సైతం తగ్గుతుంది.
ఇవీ చదవండి:
మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..
మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..