Share News

Corporate Work Culture: మొదటి సారి కార్పొరేట్ జాబ్ ప్రారంభిస్తున్నారా? ఈ విషయాలను మర్చిపోవద్దు

ABN , Publish Date - Sep 27 , 2025 | 10:34 PM

యూనివర్సిటీ చదువులు పూర్తి చేసుకుని కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటే కెరీర్‌లో ఈజీగా దూసుకుపోవచ్చు. మరి అవేంటో తాజా కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Corporate Work Culture: మొదటి సారి కార్పొరేట్ జాబ్ ప్రారంభిస్తున్నారా? ఈ విషయాలను మర్చిపోవద్దు
Corporate Jobs

ఇంటర్నెట్ డెస్క్: యూనివర్సిటీల్లో చదువు పూర్తి చేసుకుని తొలిసారి జాబ్‌లో చేరే వారు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ విషయాలపై అవగాహనతో ఉంటేనే కెరీర్‌లో నెగ్గుకురాగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో వివరంగా తెలుసుకుందాం పదండి (first corporate job tips).

కార్పొరేట్ ప్రపంచంలో దూసుకుపోయేందుకు కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదు. నిరంతర అధ్యయనంతోనే ముందడుగు వేయగలుగుతారు. డిజిటల్ నైపుణ్యాలున్న యువ ఉద్యోగులు, తమ జ్ఞానంతో వాస్తవ ప్రపంచంలోని సమస్యలు పరిష్కరించే వారికి సంస్థలు ఎక్కువ ప్రధాన్యం ఇస్తాయి. ఈ దిశగా కోర్సెరా, లింక్డ్‌ఇన్ లర్నింగ్ వంటి వేదికల్లో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు (fresh graduate job truths).

యువ ఉద్యోగులు తమ పనితీరుపై నిత్యం ఫీడ్ బ్యాక్ సానుకూల దృక్పథంతో స్వీకరించగలిగేలా మానసికంగా సిద్ధంగా ఉంటాయి. కెరీర్‌లో ఎదగాలంటే ఈ గుణం తప్పనిసరి. మీ పనిపై ఇతరుల విమర్శలను మార్గదర్శకాలుగా భావించి ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ముందుకెళ్లాలి (starting career advice).


వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య సమతౌల్యం సాధించడం కూడా ఓ నైపుణ్యమేనన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకరు చేతికిచ్చేది కాదన్న విషయం మర్చిపోకూడదు. కెరీర్‌లో రాణించాలంటే వ్యక్తిగత విషయాలకూ తప్పనిసరిగా ప్రాధాన్యం ఇవ్వాలి.

కొన్ని సార్లు యువ ఉద్యోగులకు తగిన ప్రోత్సాహం లభించక మనసుల్లో ప్రతికూల భావన ఆవరించే అవకాశం ఉంది. అయితే, కాన్ఫిడెన్స్ అనేది అనుభవంతో మాత్రమే వస్తుంది. కాబట్టి, కొత్తి విషయాలను నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంచుకోవడంపైనే యువ ఉద్యోగులు దృష్టి పెట్టాలి.

ఆఫీసులో పని సంస్కృతి కూడా ఉద్యోగుల ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది. సహోద్యోగుల మధ్య సామరస్య భావన, ఇచ్చిపుచ్చుకొనే ధోరణులు ఉత్పాదకతను పెంచుతాయి. విషపూరిత పని సంస్కృతి వల్ల టీమ్‌లోని సభ్యులందరిపైనా ప్రభావం చూపుతుంది. కాబట్టి, మర్యాదపూర్వక, సమ్మిళిత పని వాతావరణం ఎంచుకునేందుకు నిత్యం పరిసరాలపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే యువ ఉద్యోగులు త్వరగా తమకు కావాల్సిన మెళకువలను అలవర్చుకుని ముందుకు సాగగలుగుతారు.


ఇవీ చదవండి:

స్మార్ట్ ఫోన్ వ్యసనం వదుల్చుకునేందుకు పాటించాల్సిన టిప్స్

బంగారు నగలను ఇంట్లోనే ఎలా శుభ్రపరుచుకోవాలంటే..

Read Latest and Lifestyle News

Updated Date - Sep 27 , 2025 | 10:42 PM