Top Indian Dishes : భారతదేశంలోని ఈ ఫుడ్స్ చాలా ఫేమస్
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:28 AM
భారతదేశంలో ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన ఆహార సంప్రదాయాలు ఉన్నాయి. అయితే, మన దేశంలో బాగా పాపులర్ అయిన ఫుడ్స్ ఏవో మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశం.. సంస్కృతి, సంప్రదాయాలకు మాత్రమే నిలయం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆహారానికి కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు, స్థానిక రుచులు, విభిన్న వంటకాలు భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపును సంపాదించిపెట్టాయి. మీరు భోజన ప్రియులైతే, ఖచ్చితంగా ఈ ఏడు భారతీయ వంటకాలను టేస్ట్ చేయాల్సిందే..
బటర్ చికెన్
మాంసాహారులకు బటర్ చికెన్ చాలా ఇష్టమైంది. క్రీమీ గ్రేవీలో వండుకున్న ఈ వంటకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ వంటకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కూరలలో ఒకటి. దీనిని సాధారణంగా నాన్, రోటీ, పుల్కా, అన్నంతో పాటు వడ్డిస్తారు.
హైదరాబాద్ బిర్యానీ
హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వంటకం. దీని రుచి, సుగంధం, స్పెషల్ క్రీమీ, మసాలా మిశ్రమం కారణంగా, ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో కూడా బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.

దోసె
రోజూ అల్పాహారంగా చాలా మంది ఎక్కువగా దోసె తింటారు. సాంబార్, కొబ్బరి చట్నీతో దోసె రుచి మరింత పెరుగుతుంది. మీరు దక్షిణ భారతదేశాన్ని సందర్శిస్తే, మీకు పుష్కలంగా దోసెలు దొరుకుతాయి.
చోలే భాతురే
చోలే భాతురే ఉత్తర భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందింది. చాలా మంది దీనిని ఉదయం అల్పాహారంగా తీసుకుంటారు. చోలే భాతురే అనేది స్పైసీ చిక్‌పీస్ (చోలే), డీప్-ఫ్రైడ్ మైదా బ్రెడ్ (భాతూరే)ల కలయికతో కూడిన పంజాబ్ వంటకం.

పూరి సబ్జీ
పూరీ సబ్జీ చాలా రుచికరంగా ఉంటుంది. పెళ్లి అయినా, పండుగ అయినా, పూరి సబ్జీ ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది.
రోగన్ జోష్
మీరు కాశ్మీర్ సందర్శిస్తే, రోగన్ జోష్‌ను మిస్ అవ్వకండి. ఇది ఐకానిక్ కాశ్మీరీ మటన్ కర్రీ. మాంసం, పెరుగు, అనేక సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు.

పావ్ భాజీ
మీరు ముంబైకి వెళితే, పావ్ భాజీ దొరుకుతుంది. ఇందులో వెన్నతో వేయించిన పావ్‌ను భాజీతో వడ్డిస్తారు. ఇది దేశంలోని దాదాపు ప్రతి నగరంలోనూ లభిస్తుంది.
Also Read:
ఈ 6 అలవాట్లు ఇంట్లో అశాంతికి కారణమవుతాయి!
ఈ ఐదు ప్రదేశాలలోకి అస్సలు అడుగు పెట్టకండి..
For More Latest News