Tips To Store Ginger-Garlic Paste: అల్లం వెల్లుల్లి పేస్ట్.. ఎక్కువ కాలం ఇలా నిల్వ చేయండి..
ABN , Publish Date - Dec 06 , 2025 | 03:04 PM
చాలా మంది అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ని ముందుగానే తయారు చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ, ఈ పేస్ట్ కొన్ని రోజుల్లోనే చెడిపోతుంది. అయితే, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: అల్లం, వెల్లుల్లి వంటగదిలో ముఖ్యమైన పదార్థాలు. వీటిని వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తారు. అల్లం-వెల్లుల్లి పేస్ట్ భారతీయ వంటకాలకు రుచి, సువాసన ఇస్తుంది. ఇది లేకపోతే వంట పూర్తి కానట్లు అనిపిస్తుంది. అందువల్ల, చాలా మంది అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేయడానికి ఇష్టపడతారు. కానీ, ఈ పేస్ట్ కొన్ని రోజుల్లోనే చెడిపోతుంది. అయితే, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తేమ లేకుండా
ముందుగా.. అల్లం, వెల్లుల్లి ముక్కలను బాగా శుభ్రం చేసి ఎండబెట్టాలి. ఎందుకంటే, తేమ ఉన్న వాటితో పేస్ట్ చేస్తే త్వరగా చెడిపోతుంది. కాబట్టి, పేస్ట్ చేయడానికి ముందు వాటికి తేమ లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఆ పేస్ట్ ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
ఆలివ్ ఆయిల్, ఉప్పు
అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేసిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, ఒక టీస్పూన్ ఉప్పు వేసి గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేయండి. ఇవి సహజ సంరక్షణగా పనిచేస్తాయి. అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం ఉండటానికి సహాయపడతాయి.
జిప్‌లాక్ బ్యాగ్
అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను గాలి చొరబడని జిప్‌లాక్ బ్యాగ్‌లో రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే చాలా రోజులు తాజాగా ఉంటుంది. అయితే, రంధ్రాలు లేదా లీకేజీలు లేకుండా చూసుకోవడం ముఖ్యం.
టీస్పూన్ నిమ్మరసం
కొన్నిసార్లు అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఆకుపచ్చ లేదా పసుపు రంగులోకి మారుతుంది. ఈ రంగు మారడం చెడిపోవడానికి సంకేతం అని నిపుణులు అంటున్నారు. కాబట్టి, ఈ పేస్ట్ చెడిపోకుండా ఉండటానికి పేస్ట్‌లో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి, రిఫ్రిజిరేటర్‌లో గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
ఈ పాల ఉత్పత్తులు క్యాన్సర్ కణాలను చంపుతాయని మీకు తెలుసా?
మన జీవితంపైన తులసి మొక్క ఎలా ప్రభావం చూపుతుందంటే?
For More Latest News