Foods to Avoid in Winter: శీతాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..
ABN , Publish Date - Nov 20 , 2025 | 02:20 PM
శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఎలాంటి ఆహారాలకు మనం దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇది వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శీతాకాలంలో ఆహారం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం, పానీయాల విషయంలో కొంచెం అజాగ్రత్త కూడా మంచిది కాదు. కాబట్టి, ఈ సీజన్‌లో హానికరమైన ఈ ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
శీతాకాలంలో తినకూడని ఆహారాలు:
ఈ సీజన్‌లో చల్లని పానీయాలు, ఐస్ క్రీం వంటి చల్లని డెజర్ట్‌లు తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, చల్లని పాల ఉత్పత్తులు కూడా తీసుకోకుండా ఉండటం బెటర్ అని సూచిస్తున్నారు.
అలాగే, వేయించిన ఆహారాలు కూడా తినకుండా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమోసాలు, పకోడీలు వంటి నూనెలో వేయించిన స్నాక్స్ జీర్ణ సమస్యలను కలిగిస్తాయని చెబుతున్నారు. ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు.
ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక కొవ్వు, చక్కెరతో కూడిన ఆహారాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. కాబట్టి, ప్రాసెస్ చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
శీతాకాలంలో స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని, రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Also Read:
చలికాలంలో పొద్దున్నే అల్లం తింటే ఏం జరుగుతుందో తెలుసా?..
ఐ బొమ్మ రవి కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన సీపీ సజ్జనార్
For More Latest News