Egg Storage Tips: గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి.!
ABN , Publish Date - Oct 27 , 2025 | 01:05 PM
గుడ్లను చాలా మంది ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: గుడ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజూ ఉడికించిన గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది . అంతే కాదు, అవి మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను కూడా అందిస్తాయి. కానీ చాలా మంది మార్కెట్ల నుండి కొనుగోలు చేసిన గుడ్లను చాలా మంది ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. కానీ, గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గుడ్లను ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల మంచి కంటే ఎక్కువ హాని జరుగుతుంది. గుడ్లను ఎక్కువసేపు ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల పోషకాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల, వీలైనంత వరకు వాటిని ఫ్రిజ్‌లో ఉంచకుండా ఉండండి. అవసరమైతే, వాటిని తక్కువ సమయం ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది.
గుడ్లను ఫ్రిజ్‌లో ఎందుకు ఉంచకూడదు?
సాధారణంగా పోషకాలు అధికంగా ఉండే గుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. ఈ బ్యాక్టీరియా విరేచనాలు, వాంతులకు కారణమవుతుంది. గుడ్లను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల అది ఇతర ఆహార పదార్థాలకు కూడా వ్యాపిస్తుంది. కాబట్టి, గుడ్లను 3 నుండి 5 వారాల కంటే ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచకూడదు. నిల్వ చేసినప్పటికీ, వాటిని ఫ్రిజ్ దిగువన ఉన్న పెట్టెలో ఉంచాలి. ఫ్రిజ్‌లో నిల్వ చేసే ముందు గుడ్లను నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Also Read:
TTD పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఉత్తర్వులు
ఇతరులకు సహాయం చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
For More Latest News