ఈ చిట్కాలు తెలుసుకోండి..మీ వంటింటి పనులను ఈజీగా మార్చుకోండి
ABN , Publish Date - Aug 10 , 2025 | 09:36 AM
ఛార్జింగ్ లైటర్ గ్యాస్ స్టౌను ముట్టించేందుకు పలురకాల లైటర్లున్నాయి. అలాంటిదే ఇది కూడా. కాకపోతే ఈ ఎలక్ట్రిక్ లైటర్‌ను ఫోన్ ఛార్జింగ్‌లాగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎల్‌ఈడీ బ్యాటరీ డిస్‌ప్లేతో పనిచేస్తుంది.
- సులువుగా... సౌకర్యంగా...
వంటింటి ఇబ్బందుల్ని చిటికెలో పోగొట్టేందుకు ఎన్నో చిట్కాలను మార్కెట్ అందిస్తోంది. గ్యాస్ స్టౌ ఛార్జింగ్ లైటర్, సిలికాన్ ఫుడ్ సేవర్స్, బటర్ చర్నర్ గ్యాడ్జెట్లు అలాంటివే. వీటితో వంటపని మరింత సులువవుతుంది.
ఛార్జింగ్ లైటర్ గ్యాస్ స్టౌను ముట్టించేందుకు పలురకాల లైటర్లున్నాయి. అలాంటిదే ఇది కూడా. కాకపోతే ఈ ఎలక్ట్రిక్ లైటర్‌ను ఫోన్ ఛార్జింగ్‌లాగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎల్‌ఈడీ బ్యాటరీ డిస్‌ప్లేతో పనిచేస్తుంది. దీన్లో ఉన్న 5 లైట్లు వెలిగితే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయినట్లు. వుుందు భాగంలో పవర్ బటన్ ఉంటుంది. లైటర్ మెడభాగం ఎటైనా తిప్పగలిగేలా అనువుగా ఉంటుంది.
సగం ముక్కలు... తాజాగా...
కట్ చేసిన సగం ఉల్లిపాయ, టమాటా ముక్కలను మరుసటి రోజు కోసం పక్కన పెడతారు. లేదంటే నేరుగా ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. దీనివల్ల కుళ్లిపోవడమే కాకుండా, వాటిపైన బ్యాక్టీరియా చేరే ప్రమాదమూ ఉంటుంది. ‘సిలికాన్ ఫుడ్ సేవర్స్’ ఉంటే... టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి సగం ముక్కలు నిల్వచేయడం సులువవుతుంది. వివిధ ఆకృతుల్లో ఇవి లభిస్తున్నాయి. కట్‌చేసిన వాటిని సేవర్స్‌లో పెట్టి మూత బిగిస్తే, ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
కాంగ్రెస్ కీలక నేత హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
Read Latest Telangana News and National News