Dhanteras 2025 : ధన త్రయోదశి.. లక్ష్మీ దేవి, కుబేరుడి ఆశీస్సుల కోసం ఇలా చేయండి
ABN , Publish Date - Oct 18 , 2025 | 08:54 AM
ఈ రోజు ధన త్రయోదశి. లక్ష్మీదేవి, కుబేరుడిని పూజిస్తే ఇంట్లో సంపద, ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. ఈ రోజు మీతో పాటు మీ స్నేహితులు, బంధువులు కూడా లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అయితే..
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి పండుగను ఐదు రోజులు పాటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ధన త్రయోదశితో ఈ పండుగ మొదలవుతుంది.ఈ రోజు ధన త్రయోదశి కావడంతో లక్ష్మీదేవి, కుబేరుడిని భక్తితో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అంతేకాకుండా.. బంగారం, వెండి, చీపుర్లు వంటివి కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తారు. అలాగే.. అన్నదానం, యమదీపం వెలిగించడం వల్ల కూడా ఇంట్లో సంపద పెరుగుతుందని, ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని ఎక్కువగా నమ్ముతారు. అయితే, ఈ రోజు మీతో పాటు మీ స్నేహితులు, బంధువులు కూడా లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? వారికి ఇలా విషెస్ చెప్పండి.
ధన త్రయోదశి విషెస్
ధన త్రయోదశి శుభాకాంక్షలు.. మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండి సంపద కలిగించుగాక
మీ కుటుంబంలో ఎప్పుడూ సంతోషాలు నెలకొనాలని ప్రార్థిస్తూ.. ధన త్రయోదశి శుభాకాంక్షలు!
లక్ష్మీ దేవి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందం, శ్రేయస్సును కలిగించుగాక..
లక్ష్మీ దేవి మీతో ఉండాలని, కుబేరుడు మీ ఇంట్లో నివసించాలని, ధన్వంతరి అనుగ్రహంతో మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ధన్ తేరస్ శుభాకాంక్షలు.
ఈ పవిత్రమైన ధన త్రయోదశి పండుగ మీ జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును కురిపించుగాక, కుబేరుడి ఆశీస్సులతో మీ పురోగతి పెరుగుగాక..
మీ ఇల్లు సంపద, శ్రేయస్సు, ఆనందంతో నిండి ఉండాలని కుబేరుడిని ప్రార్థిస్తున్నాను. ధన్వంతరి ఆశీస్సులు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుగాక. ధన త్రయోదశి శుభాకాంక్షలు!
లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించుగాక, ధన్వంతరి మీ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించుగాక. ధన త్రయోదశి శుభాకాంక్షలు!
Also Read:
ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు.. తుపాకి, బుల్లెట్లు స్వాధీనం
హాస్టళ్ల విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
For More Latest News