Chicken and Eggs Rates: మార్కెట్లో చికెన్, కోడిగుడ్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా.?
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:27 PM
మార్కెట్లో చికెన్ ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. ఇక ఈ వారం కోడిగుడ్ల రేట్లు ఆకాశానంటుతున్నాయి. వంద కోడి గుడ్ల ధర హోల్‌సేల్‌గా రూ.650 నుంచి రూ.665కు ఎగబాకాయి. ఇక చిల్లరగా ఒక గుడ్డు ఎంతకు విక్రయిస్తున్నారంటే...
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు రోజుకో స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం.. ఏపీ మార్కెట్లలో కిలో స్కిన్‌లెస్ చికెన్(Chicken) రూ. 270, స్కిన్‌తో రూ.260 పలుకుతోంది. మరికొన్ని చోట్ల కిలో స్కిన్‌లెస్ రూ.240 నుంచి రూ.250 ఉండగా.. స్కి్న్‌తో రూ.250 నుంచి రూ.260గా ఉంది. కిలో మటన్(Mutton) ధర ఆయా మార్కెట్లలో రూ.800గా నడుస్తోంది.
ఇక, తెలంగాణాలోని హైదరాబాద్(Hyderabad)లో స్కిన్‌లెస్ రూ.260 - 280గా అమ్ముడవుతోంది. కామారెడ్డిలో కిలో చికెన్ రూ.250గానూ, మటన్ కిలో రూ.800గా సేల్ అవుతోంది. ఈ నెలాఖరుకు ఇరు రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర 280 రూపాయల వరకూ పెరిగే అవకాశమున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కోడిగుడ్ల(Eggs) విషయానికొస్తే.. ఇటీవల గుడ్డు ధర బాగా ఎగబాకింది. ఒక్కో గుడ్డు ధర రూ.8కి ఎగబాకింది. ఇటీవల హోల్‌సేల్ మార్కె్ట్లో కోడిగుడ్ల ధరలను పరిశీలిస్తే.. 100 గుడ్ల ధర రూ.650 నుంచి రూ.665 మధ్య సేల్ అవుతోంది(Wholesale Egg Rates). చిల్లరగా ఒక్కో గుడ్డు ధర రూ.7 - రూ.8గా నడుస్తోంది. దీంతో కూరగాయల రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు గుడ్లతో తీసుకుందామనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇప్పుడు ఇవీ భారమయ్యాయి.
అయితే.. చలికాలంలో గుడ్లు, చికెన్ ధరలు సహజంగానే పెరుగుతాయని కొందరు వ్యాపారులు అంటున్నారు. కానీ, గత కొన్నేళ్లుగా ఈ స్థాయిలో ధరలు పెరగుతాయని ఊహించలేదన్నట్టుగా చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు కోటి కోడిగుడ్లకు పైగా వినియోగమవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఒకరోజుకు ఉపయోగించే గుడ్ల సంఖ్య సుమారు 3 కోట్ల మేర ఉన్నట్టు అంచనా. ఇక దేశంలో రోజుకు దాదాపు 30 కోట్ల గుడ్లు ఉత్పత్తి జరుగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో 20 శాతం వరకూ ఉత్పత్తవుతున్నాయి.
ఇవీ చదవండి:
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా గృహ రుణం రావటం లేదా