Chanakya Niti Moral Lessons: ఇలాంటి వారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి.!
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:50 AM
ఈ వ్యక్తులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదని ఆచార్య చాణక్యుడు అంటున్నారు. ఇలాంటి వారిని తేలికగా తీసుకోవడం వల్ల నష్టం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో ఎవరినీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని పెద్దలు అంటుంటారు. ఎందుకంటే వారు ఎప్పుడు, ఎలా ఉపయోగపడతారో చెప్పలేం. ఆచార్య చాణక్యుడి ప్రకారం, మనం ఇలాంటి వారిని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. తేలికగా తీసుకోవడం వల్ల నష్టం కలిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
బలహీనంగా కనిపించే వారిని
చాణక్యుడి ప్రకారం, తెలివైన వ్యక్తి బలహీనంగా కనిపించే వారిని నిర్లక్ష్యం చేయడు. ఎందుకంటే అవకాశం దొరికితే, అటువంటి వ్యక్తే పెద్ద నష్టం కలిగించగలడు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో బలహీనంగా కనిపించే వారు మనల్ని ఏమీ చేయలేరు అని అనుకుంటాం.. కానీ అదే వ్యక్తి సరైన సమయంలో మనకు పెద్ద సమస్యగా మారవచ్చు.
పేదవారిని
జ్ఞానం డబ్బుతోనే వస్తుందన్న భావన తప్పని చాణక్యుడు చెప్పారు. కష్టాలు చూసిన పేదవాడికి జీవితంపై లోతైన అవగాహన ఉంటుంది. అతని అనుభవం పుస్తకాలకన్నా విలువైనది. అలాంటి వ్యక్తుల సలహాను నిర్లక్ష్యం చేయకూడదని చాణక్యుడు చెప్పారు.
నిశ్శబ్దంగా ఉండే వారిని
చాణక్యుడు మౌనం సర్వార్థ సాధనం అని అన్నారు. అంటే, నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి బలహీనుడు కాదు. అతడు ఆలోచించి మాట్లాడతాడు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. అలాంటి వాళ్లు చర్య తీసుకుంటే, అది గట్టిగా ఉంటుంది. వారి ఓర్పే వారి బలం. కాబట్టి, ఇలాంటి వారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదని చాణక్యుడు అన్నారు.
తక్కువ స్థాయి ఉద్యోగస్తులను
ఒకరి విలువ వారి హోదాలో కాదు, వారి వ్యక్తిత్వం, సామర్థ్యంలో ఉంటుందని చాణక్యుడు చెప్పారు. ఈ రోజు చిన్న ఉద్యోగంలో ఉన్న వ్యక్తి రేపు పెద్ద హోదాకు చేరవచ్చు. తక్కువ స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువ అనుభవం, నిజాయితీ, కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి, వ్యక్తిని పదవి ఆధారంగా కాదు, వారి పనిని బట్టి గౌరవించాలి.
సాధారణంగా కనిపించే వారిని
సాధారణ రూపం లేదా సాధారణ ప్రవర్తన కలిగిన వ్యక్తుల్లో అసాధారణ ప్రతిభ దాగి ఉండొచ్చు. వారు ఆడంబరాలకు పోరు. కానీ అవకాశం వచ్చినప్పుడు తమ సామర్థ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. అందుకే, బయట కనిపించే రూపాన్ని చూసి ఎవరినీ తేలికగా తీసుకోకూడదు.
(NOTE: పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఈ డ్రింక్స్ ఆల్కహాల్ కంటే ప్రమాదకరం.!
ట్రైన్‌లో ఉన్నట్టుండి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే.. వెంటనే ఇలా చేయండి.!
For More Latest News