Share News

Chanakya On Youth Mistakes: యవ్వనంలో చేసే ఈ తప్పులు జీవితాన్ని నాశనం చేస్తాయి.!

ABN , Publish Date - Dec 04 , 2025 | 02:50 PM

యవ్వనంలో చేసే ఈ తప్పులు జీవితాన్ని నాశనం చేస్తాయని ఆచార్య చాణక్యుడు అంటున్నారు. అయితే, ఏ తప్పులు జీవితాన్ని నాశనం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Chanakya On Youth Mistakes: యవ్వనంలో చేసే ఈ తప్పులు జీవితాన్ని నాశనం చేస్తాయి.!
Chanakya On Youth Mistakes

ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో వివరించారు. జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు.. ఎలాంటి వారితో స్నేహం చేయాలి? ఎలాంటి వారికి దూరంగా ఉండాలని చక్కగా వివరించారు. అంతేకాకుండా, యవ్వనంలో చేసే కొన్ని తప్పులు జీవితాన్ని నాశనం చేస్తాయని కూడా చెప్పారు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఎలాంటి తప్పులు జీవితాన్ని నాశనం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..


చెడు సహవాసం:

చెడు సహవాసం మంచి వ్యక్తిని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి, మంచి వారితో స్నేహం చేయడం చాలా ముఖ్యమని చాణక్యుడు అంటున్నారు. చెడు గుణాలు ఉన్నవారితో స్నేహం చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకోకూడని చెబుతున్నారు.

సమయం వృధా చేయడం :

యవ్వనంలో సమయం చాలా విలువైనది. ఈ సమయాన్ని మొబైల్ ఫోన్ చూస్తూ సరదాగా గడుపుతూ వృధా చేస్తే, జీవితంలో ఏమీ సాధించలేరని చాణక్యుడు అంటున్నారు. ఈ ఒక్క తప్పు వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుందని చెబుతున్నారు.


తప్పుడు నిర్ణయాలు:

చాలా మంది ఆలోచించకుండానే నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామిని ఎంచుకోవడంలో, ఉద్యోగం విషయంలో ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తరువాత పశ్చాత్తాపపడాల్సి వస్తుందని చాణక్యుడు చెబుతున్నారు.

క్రమశిక్షణ:

యవ్వనంలో అతి ముఖ్యమైన విషయం క్రమశిక్షణ. ఆలస్యంగా మేల్కొనడం, సోమరితనంతో చేయవలసిన పనులన్నింటినీ వాయిదా వేయడం, ఇవన్నీ విజయం వైపు వెళ్ళకుండా నిరోధిస్తాయి. యవ్వనంలో ఇలా ఉంటే, జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోలేరని చాణక్యుడు అంటున్నారు.

ప్రణాళికలు వేసుకోకపోవడం :

చాలా మంది భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించరు, బదులుగా తమ రోజులను సరదాగా గడుపుతారు. ఇది భవిష్యత్తులో పశ్చాత్తాపానికి దారితీస్తుంది. కాబట్టి, భవిష్యత్తు కోసం ముందుగానే కొన్ని ప్రణాళికలు వేసుకోవడం అవసరమని చాణక్యుడు సూచిస్తున్నారు.


ఇవీ చదవండి:

రీల్స్ పిచ్చి.. బ్రిడ్జిపై నుంచి పడి యువకుడు బలి..

లేడీ సీరియల్ కిల్లర్.. తనకంటే అందంగా ఉంటే చంపేస్తుంది..

Updated Date - Dec 04 , 2025 | 03:11 PM