Share News

RelationShip Tips: భార్య దగ్గర ఈ విషయాలు దాస్తున్నారా.. కచ్చితంగా సమస్యలు తప్పవు..

ABN , Publish Date - May 11 , 2025 | 07:58 PM

RelationShip Tips: చాలామంది పురుషులు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు, పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా తమ భార్యలకు చెప్పరు లేదా వారితో చర్చించరు. ఇలా చేయడం వల్ల కచ్చితంగా కొన్నిరోజుల తర్వాత సమస్యలు రాక మానవు. కాబట్టి, ఈ కింది పనులు చేసేటప్పుడు భర్త ఎప్పుడూ తన భార్య సలహా తీసుకోవాల్సిందే.

RelationShip Tips: భార్య దగ్గర ఈ విషయాలు దాస్తున్నారా.. కచ్చితంగా సమస్యలు తప్పవు..
Important Decisions Couples Should Discuss

Important Decisions Couples Should Discuss: భార్యాభర్తలు ప్రతి మనసా వాచా కర్మణా ప్రతి విషయంలో ఒకరికొకరు అన్నట్టు ఉండాలని పెద్దలంటారు. చేసే పనుల్లో, మాటల్లో, చేతల్లో దాపరికాలు లేకుండా కలసిమెలసి జీవిత పయనంలో అడుగులెయ్యాలి. అలా కాక ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. నిత్యం పోట్లాటలతో ఆ సంసారం రణరంగాన్నే తలపిస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదంటే.. భర్త కచ్చితంగా కొన్ని పెద్ద నిర్ణయాలు, పనులు చేసే ముందు భార్యలకు చెప్పాలి. వారి అభిప్రాయం, సలహా, సూచనలు, నిర్ణయం ఏమిటో కచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే, కుటుంబ విషయాల్లో భార్య కచ్చితంగా పరిణతితో వ్యవహరిస్తుంది. ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను వేగంగా అంచనా వేయగలరు. మరి, భార్యను సంప్రదించిన తర్వాతే భర్త ఏ పనులు చేయాలో ఇప్పుడు చూద్దాం.


డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు

ఎవరైనా మిమ్మల్ని అప్పు అడిగినా లేదా మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వవలసి వస్తే ముందుగా మీ భార్యతో దాని గురించి చర్చించండి. మంచి చెడులు తెలిసిన భార్య ఈ విషయంలో మీకు సరైన సలహా ఇస్తుంది. చివరగా ఆమె అనుమతితో మాత్రమే ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వండి.


పెట్టుబడి

భర్త ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా లేదా ఆస్తి కొనాలనుకుంటున్నా అతడు కచ్చితంగా ఆ విషయాలను తన భార్యకు తెలియజేయాలి. ఇక్కడ పెట్టుబడి పెట్టడం సరైందేనా, పెట్టుబడి పెట్టవచ్చా అనే దానిపై మీ భార్య అభిప్రాయాలను అడగండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీ వైవాహిక జీవితాన్ని సజావుగా కొనసాగించడంలో సహాయపడతాయి.


ఎక్కడికైనా ప్రయాణిస్తుంటే

కొంతమంది పురుషులు తమ భార్యలకు ప్రతిదీ చెప్పరు లేదా వారు ఏదైనా పని చేసినప్పుడు కూడా చెప్పరు. ఇలా ఎప్పుడూ చేయకూడదు. మీరు స్నేహితులు లేదా సహోద్యోగులతో కలిసి ట్రిప్‌కు వెళుతుంటే.. వెళ్లడానికి మీ భార్యను అడిగి వెళ్లండి. ఆమె అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. లేకపోతే మీ ఈ ప్రవర్తన వల్ల భార్యకు నమ్మకం తొలగిపోతుంది. లేనిపోని అనుమానాలకు తావు ఇవ్వకూడదంటే ఈ విషయం కచ్చితంగా చెప్పి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకూడదు.


ఇంటికి వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు

మీరు ఇంటి కోసం ఏదైనా కొనబోతున్నట్లయితే ముందుగా మీ భార్య అభిప్రాయం అడగండి. తనకు ఏ వస్తువులు సరిపోతాయో, ఇంటికి ఏ వస్తువులు కొనాలో, ఎంత బడ్జెట్‌లో కొనాలో ఆమెకు అవగాహన ఉంటుంది. కాబట్టి, ఇంటికి వస్తువులు కొనే ముందు మీ భార్య అభిప్రాయం అడగండి.


పిల్లల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు

పిల్లల బాధ్యత భార్యాభర్తలిద్దరిపైనా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం భర్త ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవలసి వస్తే అతడు తన భార్య అభిప్రాయం కచ్చితంగా అడిగి అనుమతి తీసుకోవాలి. ఆమె తప్పొప్పులు అంచనా వేసి ఈ విషయంలో తగిన సలహా తప్పక ఇస్తుంది.


Read Also: Sleeping Tips: నిద్రలేమి వేధిస్తోందా.. 4-7-8 టెక్నిక్‌తో క్షణాల్లో గాఢ నిద్ర..

Eye Health: గీతలు పడిన కళ్లద్దాలు వాడుతున్నారా.. ఈ 5 తీవ్ర సమస్యలు తప్పవు..

Chanakya Niti: చాణక్య నీతి.. ఈ విషయాలు పతనానికి కారణమవుతాయి..

Updated Date - May 11 , 2025 | 08:12 PM