Russia: రష్యా విక్టరీ డే అతిథులకు ఉక్రెయిన్ హెచ్చరిక
ABN , Publish Date - May 04 , 2025 | 04:52 AM
విక్టరీ-డే పరేడ్‌లో పాల్గొనబోయే విదేశీ నాయకుల భద్రతకు హామీ ఇవ్వలేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. రష్యా ప్రతిపాదించిన కాల్పుల విరమణను తిరస్కరించిన ఆయన, రష్యా భూభాగంలో జరిగే కార్యక్రమాలకు తమకు బాధ్యతలేదని పేర్కొన్నారు.
మాస్కో: రష్యాలో ఈనెల 9న జరగనున్న విక్టరీ-డే పరేడ్‌కు హాజరయ్యే విదేశీ ప్రముఖుల భద్రతకు హామీ ఇవ్వలేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. విక్టరీ-డే సందర్భంగా రష్యా ప్రతిపాదించిన 3 రోజుల కాల్పుల విరమణను కూడా ఆయన తిరస్కరించారు. ‘‘రష్యన్ భూభాగంలో జరిగే దానికి మేం బాధ్యత వహించలేం. మీ భద్రతపై హామీ ఇవ్వలేం’’ అని విదేశీ నాయకులను ఉద్దేశించి జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయం సాధించిన రష్యా 80వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ వేడుకలకు మోదీ, జిన్‌పింగ్ సహా 20కంటే ఎక్కువ మిత్ర దేశాల నాయకులను రష్యా ఆహ్వానించింది. అయితే, పహల్గాం ఘటన నేపథ్యంలో ఈ పరేడ్‌కు మోదీకి బదులుగా రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్ హాజరుకానున్నారు.
ఇవి కూడా చదవండి
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..