Share News

Zelensky: ఐరోపాకు అమెరికా అండగా నిలిచే రోజులు పోయాయి: ఉక్రెయిన్ అధ్యక్షుడు

ABN , Publish Date - Feb 15 , 2025 | 08:32 PM

ఐరోపా దేశాల రక్షణ కోసం ఉమ్మడిగా సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. ఐరోపాకు అమెరికా అండగా నిలిచే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. ఐరోపా భవితవ్యం ఐరోపా వాసుల చేతుల్లోనే ఉందని అన్నారు.

Zelensky: ఐరోపాకు అమెరికా అండగా నిలిచే రోజులు పోయాయి: ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఇంటర్నెట్ డెస్క్: ఐరోపా దేశాల రక్షణ కోసం ఉమ్మడిగా సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. జర్మనీలో జరుగుతున్న మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒకప్పటిలా అమెరికా యూరొప్‌కు అండగా నిలవదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై అమెరికా, రష్యా మధ్య సంప్రదింపులు జరుగుతున్న నేపత్యంలో జెలెన్‌స్కీ ఈ కామెంట్స్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఉక్రెయిన్‌తో నిమిత్తం లేకుండా రష్యా, అమెరికా నేరుగా చర్చలు జరపడంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడిలో అసంతృప్తి నెలకొంది. నాటోలో చేర్చుకోవడంపై కూడా అమెరికా నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో జెలెన్‌స్కీ ఐరోపా దేశాలను ఈ మేరకు హెచ్చరించారు (Ukraine).


Israel Hostage Release: ముగ్గురు ఇజ్రాయలీలను విడిచిపెట్టిన హమాస్! దాదాపు 500 రోజుల తరువాత స్వేచ్ఛ

‘‘ఐరోపా భద్రత కోసం ఓ ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఐరోపా భవితవ్యం ఐరోపా వాసుల చేతుల్లోనే ఉంది. రష్యా శాంతిని కోరుకునే దేశం కాదు. అది చర్చల కోసం రెడీ కావట్లేదు’’ అని అన్నారు.

శిక్షణ కార్యక్రమాల పేరిట రష్యా తన సైన్యాలను బెలారుస్‌కు పంపించే యోచనలో ఉన్నట్టు తనకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని జెలెన్‌స్కీ అన్నారు. ఈ తీరుతో నేటో దేశాలకు నేరుగా ముప్పు ఎదుర్కొంటాయని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడి దృష్టిలో బెలారస్ ఒక దేశం కాదని, తమ దేశంలోని ఒక భాగమని అన్నారు. నాటోలో చేరే అవకాశం లేకపోతే ఉక్రెయిన్‌కు తనని తాను రక్షించుకునేందుకు ఇప్పటికంటే రెండు రెట్లు పెద్ద సైన్యం కావాలని ఆయన పేర్కొన్నారు.


Blair House: అమెరికాలో ప్రధాని మోదీ విడిది చేసిన ఈ 200 ఏళ్ల నాటి గెస్ట్ హౌస్ గురించి తెలిస్తే..

కాగా, యుద్ధ విరమణపై చర్చించేందుకు జెలెన్‌స్కీ శుక్రవారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో కూడా సమావేశమయ్యారు. తమ భద్రతకు ఢోకా ఉండదన్న హామీ లభించాకే రష్యాతో చర్చలకు వస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో రష్యా దాడికి దిగితే అమెరికా సైన్యం సాయం లేకుండా తమ దేశం మనగలగడం చాలా కష్టమని ఆయన మీడియాతో అన్నారు. అయితే, ఉక్రెయిన్‌కు అమెరికా సైన్యాన్ని తరలించే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే స్పష్టం చేశారు.

Donald Trump: ట్రంప్, మోదీ సంయుక్త ప్రకటన.. పాక్‌కు షాక్!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 15 , 2025 | 08:32 PM