H1B exemption list: హెచ్1బీ వీసా పెంపు.. ఈ రంగాల వారికి మినహాయింపు లభిస్తుందా?
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:49 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచేసి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ భారీ ఫీజు కారణంగా మన దేశంలోని ఐటీ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచేసి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ భారీ ఫీజు కారణంగా మన దేశంలోని ఐటీ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇకపై అమెరికాకు ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే వారు లక్ష డాలర్లును హెచ్1బీ వీసా ఫీజుగా చెల్లించాలి. అయితే ఈ భారీ ఫీజు నుంచి కొన్ని రంగాలకు మినహాయింపు లభించబోతున్నట్టు తెలుస్తోంది (H-1B $100K fee exemption).
అమెరికా జాతీయ ప్రాధాన్యం, తక్షణ అవసరాల నిమిత్తం కొన్ని రంగాల్లో పని చేసే వారిని ఈ భారీ ఫీజు నుంచి మినహాయించబోతున్నారట (Trump H-1B visa fee 2025). అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఈ మినహాయింపుల ప్రస్తావన ఉంది. పలు కీలక రంగాల నిపుణులకు ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయాలను అన్వేషించడం కుదరదు. ఈ నేపథ్యంలో వీసా ఫీజు నుంచి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకునే అవకాశం కంపెనీలకు కల్పిస్తూ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయంలో తన విచక్షణను ఉపయోగించి నిర్ణయం తీసుకునే అధికారాన్ని యూఎస్‌లోని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శికి అప్పగించారు (H1B fee waiver).
ముఖ్యంగా ఈ భారీ ఫీజుల నుంచి వైద్యులకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది (H1B exemption list). డాక్టర్లతో పాటు వైద్య, ఆరోగ్య పరిశోధకులకు, రక్షణ, జాతీయ భద్రతా నిపుణులకు కూడా ఈ భారీ ఫీజు నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉందట. అలాగే ఇంధన, స్టెమ్ కార్యకలాపాలు, విమానయానం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పని చేసే వారికి కూడా హెచ్1బీ భారీ ఫీజు నుంచి మినహాయింపు లభించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
మ్యాచ్ ఓడినా యుద్ధంలో గెలిచాం.. పాక్ క్రికెటర్ భార్య సంచలన పోస్ట్..
ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్
మరిన్ని క్రీడా, అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..