Share News

Visa Holders: హెచ్‌ 1బీ గందరగోళం..

ABN , Publish Date - Oct 23 , 2025 | 04:49 AM

హెచ్‌-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో అమెరికా రిటైల్‌ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్‌.. ఉద్యోగ నియామకాల అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది.

Visa Holders: హెచ్‌ 1బీ గందరగోళం..

  • వాల్‌మార్ట్‌లో నియామకాలు బంద్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 22: హెచ్‌-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో అమెరికా రిటైల్‌ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్‌.. ఉద్యోగ నియామకాల అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసా స్పాన్సర్‌షిప్‌ అవసరమున్న వారికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని తాత్కాలికంగా ఆపేసింది. అయితే, హెచ్‌-1బీ వీసా నూతన నిబంధనల నేపథ్యంలో దీనిపై పునరాలోచనలు చేస్తున్నామని వాల్‌మార్ట్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. తమ వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు అవసరమైన నియామకాలు చేపట్టేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. వాల్‌మార్ట్‌ ఇప్పటిదాకా 2,390 హెచ్‌-1బీ వీసాదారులకు ఉద్యోగాలు ఇచ్చింది. అయితే, వాల్‌మార్ట్‌ తీసుకున్న నిర్ణయం విదేశీ ఉద్యోగుల నియామకం అంశంలో అమెరికన్‌ సంస్థలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న గందరగోళానికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Oct 23 , 2025 | 04:49 AM