Share News

US Visa Rules 2025: అమెరికా వీసాల జారీలో అధిగమించలేని మరో మెలికపెట్టిన ట్రంప్

ABN , Publish Date - Nov 08 , 2025 | 07:21 AM

అమెరికా వీసాల జారీలో ఇప్పటికే పలు కఠిన నిబందనలు తీసుకొచ్చిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. . ఇప్పుడు అధిగమించలేని మరో మెలిక పెట్టారు. ఫలితంగా డయాబెటిస్, గుండెజబ్బులు ఉంటే..

US Visa Rules 2025: అమెరికా వీసాల జారీలో అధిగమించలేని మరో మెలికపెట్టిన ట్రంప్
US visa rules 2025

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా వీసాల జారీలో ఇప్పటికే పలు కఠిన నిబందనలు తీసుకొచ్చిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. . ఇప్పుడు అమెరికా వీసాల జారీలో అధిగమించలేని మరో మెలిక పెట్టారు. ఫలితంగా డయాబెటిస్, గుండెజబ్బులు ఉంటే సదరు వ్యక్తికి అమెరికా వీసా రాకపోవచ్చు.


డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు. డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న విదేశీయులకు వీసా లేదా గ్రీన్ కార్డు నిరాకరించే అవకాశం ఉంది. ఇది 'పబ్లిక్ ఛార్జ్' (ప్రభుత్వ భారం) నియమానికి అనుగుణంగా తీసుకొచ్చారు.


స్టేట్ డిపార్ట్‌మెంట్ పంపిన విధానాల ప్రకారం, వీసా అధికారులు దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని పరిశీలించి, జీవితకాలం మొత్తం వైద్య ఖర్చులు (లక్షల డాలర్లు) ప్రభుత్వంపై పడకుండా స్వయం సమర్థత ఉందా అని నిర్ణయిస్తారు. కుటుంబ సభ్యుల వ్యాధులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.


వీసాలు జారీ చేసేందుకు ఇప్పటివరకు కేవలం అంటు వ్యాధులు (టీబీ వంటివి) మాత్రమే పరీక్షించేవారు. ఈ మార్పు భారత్‌లోని 10 కోట్లకుపైగా డయాబెటిస్ రోగులను ప్రభావితం చేయవచ్చు. టూరిస్టు, స్టూడెంట్ట్ వీసాలపై ఇంకా స్పష్టత రాలేదు.


ఇది.. వివక్షాపూరితమని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంటున్నారు. వృద్ధులు-దీర్ఘకాలిక రోగుల ఇమ్మిగ్రేషన్‌ను ఈ నియమం తగ్గిస్తుందని విమర్శిస్తున్నారు. కాగా, ట్రంప్ మొదటి టర్మ్‌లో ఇలాంటి పాలసీని కోర్టులు అడ్డుకున్నాయి. ఇప్పుడు మళ్లీ అమలు చేయాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.


ఇవీ చదవండి:

మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ

Nifty Stock Market: 25500 దిగువకు నిఫ్టీ

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 07:24 AM