Social Media Screening: నేటి నుంచి హెచ్ 1బీ, హెచ్4 వీసాల సోషల్ మీడియా స్క్రీనింగ్..
ABN , Publish Date - Dec 15 , 2025 | 07:18 AM
హెచ్ 1బీ, హెచ్4 వీసాలకు సంబంధించిన పూర్తిస్థాయి స్క్రీనింగ్, పరిశీలన ఈరోజు(సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా అమెరికా పరిశీలించనుంది.
హెచ్ 1బీ, హెచ్4 వీసాలకు సంబంధించిన పూర్తిస్థాయి స్క్రీనింగ్, పరిశీలనను అమెరికా ప్రభుత్వం ఈరోజు(సోమవారం) నుంచి మొదలుపెట్టనుంది. ఇందులో భాగంగా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించనుంది. ఈ విషయాన్ని ది స్టేట్ డిపార్ట్‌మెంట్ మీడియాకు తెలియజేసింది. కేవలం హెచ్1 బీ వీసా దరఖాస్తుదారుల ఖాతాలను మాత్రమే కాకుండా.. హెచ్ 4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించనుంది. వీసా దరఖాస్తుదారులు తమ ఖాతాను ప్రైవేటు నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాలని సూచించింది. ఇండియాకు చెందిన హెచ్ 1 బీ వీసా దరఖాస్తుదారులు ఇప్పటికే ఇండియాలో ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్నారు.
అమెరికా ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ గైడ్ లైన్స్ కారణంగా మరోసారి ఇంటర్వ్యూకు వెళ్లాల్సి ఉంటుంది. ది స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘అమెరికా వీసా గౌరవం మాత్రమే .. అది హక్కు కాదు. వీసా పొందడానికి ఎవరు అర్హులో ఎవరు కాదో తెలుసుకోవటానికి అందుబాటులో ఉన్న అన్ని రకాల సమాచారాన్ని స్కీనింగ్, పరిశీలన చేస్తాం. దేశ భద్రతకు, పబ్లిక్ సేఫ్టీకి ఆటంకంగా మారే వారిని అమెరికాలోని అడుగుపెట్టనీయం’ అని పేర్కొన్నారు.
గోల్డ్ కార్డు కొన్నవాళ్లకు ఐదేళ్లలోనే అమెరికా పౌరసత్వం
భారత్, చైనా వంటి దేశాల నుంచి వచ్చి అమెరికాలోని అత్యుత్తమ కాలేజీల్లో చదువుకున్న ప్రతిభావంతులైన విద్యార్థులను తిరిగి స్వదేశాలకు వెళ్లనివ్వటం సిగ్గుచేటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అలాంటి విద్యార్థులకు అమెరికన్ కంపెనీలు ఉద్యోగాలిచ్చి అమెరికాకే సేవలందించేలా చర్యలు తీసుకోవాలని అమెరికాలోని టాప్ కంపెనీల సీఈఓలకు సూచించారు. ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను అమెరికాలోనే ఉంచేందుకు కంపెనీలు వారి కోసం గోల్డ్ కార్డులను కొనుగోలు చేయాలని సూచించారు. గోల్డ్ కార్డు కొన్నవాళ్లకు ఐదేళ్లలోనే అమెరికా పౌరసత్వం వస్తుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
సిడ్నీ కాల్పుల్లో తృటిలో తప్పించుకున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్
ఆస్ట్రేలియా బాండి బీచ్ వద్ద కాల్పులు.. 10 మంది మృతి