Share News

Longest Government Shutdown: కీలక పరిణామం.. ప్రభుత్వ షట్‌డౌన్ ముగింపు దిశగా అమెరికా..

ABN , Publish Date - Nov 13 , 2025 | 08:34 AM

43 రోజుల పాటు సుధీర్ఘంగా కొనసాగిన ప్రభుత్వ షట్‌డౌన్‌కు అమెరికా ముగింపు పలికింది. వైట్‌హౌస్ ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే ఫండింగ్ బిల్‌కు ఆమోదం తెలిపింది.

Longest Government Shutdown: కీలక పరిణామం.. ప్రభుత్వ షట్‌డౌన్ ముగింపు దిశగా అమెరికా..
Longest Government Shutdown

ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే దిశగా అమెరికా అడుగులు వేసింది. ఈ మేరకు ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే ఫండింగ్ బిల్‌కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అమెరికా కాంగ్రెస్‌లో బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా.. 222 మంది సభ్యులు ప్రభుత్వ షట్‌డౌన్ ముగింపునకు సానుకూలంగా ఓట్లు వేశారు. మరో 209 మంది సభ్యులు షట్‌డౌన్ ముగింపును వ్యతిరేకిస్తూ ఓట్లు వేశారు. 222 - 209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...


అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు బిల్లుకు మద్దతుగా ఓటు వేశారు. ప్రస్తుతం ఆ బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గరకు వెళ్లింది. ఈ రోజు( గురువారం) రాత్రి 9.45 గంటలకు ఆయన ఆ బిల్లుపై సంతకం చేయనున్నారు. అధ్యక్షుడి సంతకంతో బిల్లు అమల్లోకి రానుంది. 43 రోజుల పాటు సుధీర్ఘంగా కొనసాగిన ప్రభుత్వ షట్‌డౌన్‌కు తెరపడనుంది. ఇక, ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా అమెరికా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు.


ఇవి కూడా చదవండి

సెన్సార్‌ పూర్తి... రిలీజ్‌కు రెడీ

చల్లటి నీరు Vs వేడి నీరు.. శీతాకాలంలో స్నానం చేయడానికి ఏ నీరు మంచిది?

Updated Date - Nov 13 , 2025 | 08:44 AM