Share News

Green Card Holder Interrogation: గ్రీన్‌కార్డుదారుడిని నగ్నంగా ఇంటరాగేషన్.. అమెరికాలో దారుణం

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:51 PM

గ్రీన్ కార్డు ఉన్న ఓ వ్యక్తి అమెరికా కస్టమ్స్ బార్డర్ శాఖ అధికారులు నగ్నంగా ఇంటరాగేషన్ చేశారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Green Card Holder Interrogation: గ్రీన్‌కార్డుదారుడిని నగ్నంగా ఇంటరాగేషన్.. అమెరికాలో దారుణం
Green Card Holder Interrogation

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా గ్రీన్ కార్డు ఉన్న జర్మనీ దేశస్థుడు ఫేబియన్ ష్మిడ్‌‌కు (34) తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది. లగ్జంబర్‌ పర్యటన అనంతరం తిరిగొచ్చిన అతడిని లాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్టులో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ష్మిడ్‌ను అధికారులు నగ్నంగా మార్చి ఇంటరాగేషన్ చేశారని అతడి కుటుంబసభ్యులు ఆరోపించారు. విచారణ హింసాత్మకంగా మారిందని మండిపడ్డారు. ఆ తరువాత అతడిని డొనాల్డ్ డబ్ల్యూ వైట్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారని చెప్పారు. అతడిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తమకు తెలీదని ష్మిడ్ కుటుంబసభ్యులు వాపోయారు. ఇటీవలే అతడి గ్రీన్ కార్డు రెన్యూ అయ్యిందని, అతడిపై ఎటువంటి న్యాయపరమైన వివాదాలు లేవని తెలిపారు. టీనేజ్ వయసు నుంచి అమెరికాలో ఉంటున్న ష్మిట్ ప్రస్తుతం న్యూహ్యాంప్‌షైర్‌లో నివసిస్తున్నారు (Green Card Holder Interrogation).


Sunita Williams Butch Wilmore: భూమ్మీదకొచ్చాక నాసా వ్యోమగాములకు ఆరోగ్యపరమైన సవాళ్లు

తొలుత ష్మిడ్ భాగస్వామిని అతడికి ఇంటికి తీసుకొచ్చేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. కొన్ని గంటల పాటు వేచి చూసినా ష్మిడ్ రాకపోవడంతో అధికారులను సంప్రదించగా అతడిని అదుపులోకి తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘గ్రీన్ కార్డుకు సంబంధించి ఏదో సమస్య ఉందని మాత్రమే చెప్పారు’’ అని ష్మిడ్ తల్లి ఆస్ట్రిడ్ సీనియర్ తెలిపారు. తన కుమారుడిని అవమానించేలా, దారుణంగా ఇమిగ్రేషన్ అధికారులు వ్యవహరించారని వాపోయారు. ఇంటరాగేషన్ హింసాత్మకంగా సాగిందని, బలవంతంగా దస్తులు విప్పించి, చన్నీళ్ల స్నానం చేయించారని ఆరోపించారు. ‘‘అతడికి తాగేందుకు కూడా ఏమీ ఇవ్వలేదు. చివరకు అతడికి ఒంట్లో ఏదో తేడాగా అనిపించింది. ఆ తరువాత కుప్పకూలిపోయాడు’’ అనపి తెలిపారు. గ్రీన్ కార్డు, ఇతర పర్యాటక డాక్యుమెంట్లు అన్నీ ఉన్నా ష్మిడ్ అధికారుల దృష్టిలోకి వచ్చారని అన్నారు.


SpaceX Crew 10: మరికొన్ని రోజుల్లో భూమిపైకి సునీతా విలియమ్స్..స్పేస్‎ఎక్స్ డాకింగ్ సక్సెస్..

‘‘చట్టాలు లేక విసా నిబంధనలు ఉల్లంఘిస్తే పర్యాటకులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే, వ్యక్తిగత నిబంధనల కారణంగా అధికారులు పూర్తి వివరాలను వెల్లడించకూడదు’’ అని కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ అసిస్టెంట్ కమిషనర్ పేర్కొన్నారు. ఈ ఘటన అమెరికా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన వలసల విధానంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Latest and International News

Updated Date - Mar 16 , 2025 | 05:57 PM