Sunita Williams Butch Wilmore: భూమ్మీదకొచ్చాక నాసా వ్యోమగాములకు ఆరోగ్యపరమైన సవాళ్లు
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:13 PM
మార్చి 19న నాసా వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ భూమ్మీదకు రానున్నారు. అయితే, ఇక్కడకు చేరుకున్నాక మొదట్లో వారు కొన్ని ఆరోగ్య పరమైన సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్, మరో నాసా ఆస్ట్రొనాట్ త్వరలో భూమికి తిరిగిరానున్నారు. అన్ని అనుకూలంగా జరిగితే, ఈ నెల 19నే వారు తిరుగుప్రయాణమయ్యే అవకాశం ఉంది. వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చేందుకు నాసా అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
అయితే, భూమ్మీదకు వచ్చాక వారికి పలు ఆరోగ్య పరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలో తక్కువ గురుత్వాకర్షణ శక్తిలో గడిపినందుకు వారి శరీరం బలహీనపడిందని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా భూమ్మీదున్న అధిక గ్రావిటీ వారికి కొంత ఇబ్బంది కలిగించొచ్చని అంటున్నారు.
SpaceX Crew 10: మరికొన్ని రోజుల్లో భూమిపైకి సునీతా విలియమ్స్..స్పేస్ఎక్స్ డాకింగ్ సక్సెస్..
అంతరిక్షంలో ఎక్కువకాలం పాటు ఉంటే వచ్చే సమస్యలు..
అంతరిక్షం కేంద్రంలో వ్యోమగాము తేలుతూ ఉంటారు. ఫలితంగా వారి కాళ్లపై శరీరపు బరువు ఉండవు. దీంతో, కాళ్లకు పని తగ్గి అవి క్రమంగా బలహీనపడతాయి. చిన్నారుల కాళ్లలాగా సున్నితంగా మారతాయట. దీన్ని బేబీ ఫీట్ అని అంటారు.
ఇక కంగరాలు, ఎముకలకు కూడా పని తగ్గి అవి కూడా బలహీనమవుతాయి. ఇక రెగ్యులర్ కసరత్తులు లేక పోతే ఎముకల సాంద్రత తగ్గుతుంది. పెళుసుగా మారిపోతాయి. అధ్యయనాల ప్రకారం, అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నెలకు ఒక శాతం చొప్పున ఎముకల్లోని సాంద్రత కోల్పోతారట.
NASA Crew 10 Mission: నాసా క్రూ-10 మిషన్ ప్రారంభం.. త్వరలో భూమ్మీదకు చేరనున్న సునీతా విలియమ్స్
అయితే, ఈ సమస్యలు రాకుండా వ్యోమగాములు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా రోజుకు కచ్చితంగా రెండు గంటల పాటు అంతరిక్షంలో కసరత్తులు చేస్తారు. ఆస్ట్రోనాట్‌లకు అవసరమైన ఆహారం, కసరత్తులు, ఔషధాలు నిత్యం అందుబాటులో ఉండేలా నాసా జాగ్రత్తలు తీసుకుంటుంది.
అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడపడంతో సునీతా, బుచ్ విల్‌మోర్‌లు భూమ్మీద వాతావరణానికి అలవాటు పడే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. బేబీ ఫీట్ కారణంగా వారు నడిచేందుకు ఇబ్బంది పడతారట. అయితే, భూమ్మీదకు చేరుకున్నాక వారికి అన్ని రకాల వైద్య సహాయాలు అందించేందుకు నాసా అన్ని ఏర్పాట్లు చేసింది.
Read Latest and International News