వామ్మో.. ఆ భారం భరించలేం!
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:49 AM
అక్రమ వలసదారులను దేశం నుంచి తరలించేందుకు అమెరికా ప్రభుత్వం సైనిక విమానాల వినియోగాన్ని నిలిపివేసింది. వాటి వినియోగానికి భారీగా వ్యయం అవుతుండటమే తాజా నిర్ణయానికి కారణమని న్యూయా ర్క్ నగరానికి చెందిన ఒక పత్రిక కథనాన్ని ప్రచురించింది.

అక్రమ వలసదారుల తరలింపులో అమెరికా సైనిక విమానాలకు స్వస్తి
వాషింగ్టన్ డీసీ, మార్చి 6: అక్రమ వలసదారులను దేశం నుంచి తరలించేందుకు అమెరికా ప్రభుత్వం సైనిక విమానాల వినియోగాన్ని నిలిపివేసింది. వాటి వినియోగానికి భారీగా వ్యయం అవుతుండటమే తాజా నిర్ణయానికి కారణమని న్యూయా ర్క్ నగరానికి చెందిన ఒక పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ ఆపరేషన్‌లో సైనిక విమానాలను చివరిసారిగా ఈనెల 1న వినియోగించారు. రానున్న కొన్ని రోజుల వరకు సైనిక విమానాలు పంపే షె డ్యూల్ ఏమీ లేదని అమెరికా రక్షణవిభాగం అధికారులు తెలిపారు.
మరికొంత కాలం ఈ ఆపరేషన్లకు సైనిక విమానాలను వినియోగించకపోవచ్చని, లేదా శాశ్వతంగా ఈ ఆపరేషన్లకు వాటిని వాడకపోవచ్చని చెప్పారు. అక్రమ వలసదారుల వ్యవహారాలు చూసే హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ ఆపరేషన్లకు సాధారణంగా కమర్షియల్ విమానాలను వినియోగిస్తోంది. అయితే, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టా క అక్రమ వలసలపై గట్టి సందేశం ఇచ్చేందుకే వారి ని సైనిక విమానాలలో తరలించినట్టు ఆ కథనం పేర్కొంది.