Share News

US flight catches fire: గాల్లో ఉండగానే మంటలు.. ప్రమాదంలో అమెరికా విమానం.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 20 , 2025 | 08:47 AM

అమెరికాలోని లాస్‌ఏంజెలెస్ నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రమాదం సంభవించింది. పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్‌లో నుంచి మంటలు వస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

US flight catches fire: గాల్లో ఉండగానే మంటలు.. ప్రమాదంలో అమెరికా విమానం.. వీడియో వైరల్
US flight catches fire

విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయి గాల్లో ఉన్న సమయంలో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగడంతో ఓ విమానాన్ని (Flight) అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అమెరికా (America)లోని లాస్‌ఏంజెలెస్ నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్‌లో నుంచి మంటలు వస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (US flight catches fire).


లాస్‌ఏంజెలెస్ నుంచి అట్లాంటాకు బయల్దేరిన డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 767-400 విమానంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సమస్య తలెత్తింది. విమానం గాల్లో ఉండగానే ఎడమ వైపు ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే పైలెట్లు అప్రమత్తమై విమానాశ్రయ సిబ్బందికి సమాచారం అందించారు. విమానాన్ని వెనక్కి మళ్లించి లాస్‌ఏంజెలెస్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పటికే విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


ప్రమాదానికి గురైన ఈ విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, మంటలు చెలరేగడానికి కారణం ఏంటి అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేన్ దర్యాఫ్తును ప్రారంభించింది. గత ఏప్రిల్ నెలలో కూడా ఈ డెల్టా ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానం ఇదే తరహాలో ప్రమాదానికి గురైంది.


ఇవి కూడా చదవండి:

పహల్గాం దాడి చేసిన టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా.. స్వాగతించిన భారత్

ట్రంప్ కాళ్ల వాపుపై స్పందించిన వైట్ హౌస్.. వృద్ధుల్లో కనిపించే సాధారణ సమస్యేనని క్లారిటీ

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 09:01 AM