Share News

US Debt: అమెరికా అప్పులు రూ.3.25 కోట్ల కోట్లు

ABN , Publish Date - Aug 14 , 2025 | 03:16 AM

అమెరికా రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. అంచనాలకు మించి భారీగా రుణభారం పెరిగిపోతోంది..

US Debt: అమెరికా అప్పులు రూ.3.25 కోట్ల కోట్లు

వాషింగ్టన్‌, ఆగస్టు 13: అమెరికా రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. అంచనాలకు మించి భారీగా రుణభారం పెరిగిపోతోంది. మొత్తం అప్పులు 37 ట్రిలియన్‌ డాలర్ల(రూ.3.25 కోట్ల కోట్లు)కు చేరాయి. అమెరికా ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా రుణ భారం 2030 నాటికి 37 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని 2020లో అంచనా వేశారు. కానీ, రుణ భారం చాలా వేగంగా పెరిగింది. ఈ ఏడాదే 37 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. కరోనా సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు భారీగా రుణాలు సేకరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు పెద్ద మొత్తంలో అప్పులు చేశారు. రాబోయే దశాబ్ద కాలంలో మరో 4.1 ట్రిలియన్‌ డాలర్లు రుణాలుగా సేకరించేందుకు అవకాశం కల్పించే బిల్లుకు ఇటీవల ట్రంప్‌ ఆమోదముద్ర వేశారు.

Updated Date - Aug 14 , 2025 | 03:16 AM