బీ 2 బాంబర్ల మోహరింపు
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:15 AM
ఆరు బీ2 స్టెల్త్ బాంబర్లను హిందూ మహాసముద్రంలోని డీగో గార్షియా దీవిలో మోహరించారు

ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాక ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారించి ఈ ఏడాది మార్చిలోనే.. ఆరు బీ2 స్టెల్త్ బాంబర్లను హిందూ మహాసముద్రంలోని డీగో గార్షియా దీవిలో మోహరించారు. మే నెలలో బీ 52 బాంబర్లను కూడా అక్కడికి తరలించారు. ఈ ద్వీపం ఇరాన్‌కు 4,842 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ, బీ2 బాంబర్ల రేంజ్ 11 వేల కిలోమీటర్లు. అంటే.. అమెరికా తల్చుకుంటే బీ2 బాంబర్లు సురక్షితంగా ఇరాన్‌కు వెళ్లి అణు శుద్ధి కేంద్రాలున్న బంకర్లపై బాంబులు జారవిడిచి, వెనక్కి తిరిగి వచ్చేయగలవు. అలా వెళ్లాలంటే ఇరాన్ గగనతలంపై ఇజ్రాయెల్‌కు లేదా అమెరికాకు నియంత్రణ కావాలి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంపై తమకు పూర్తి నియంత్రణ ఉందని ఇజ్రాయెల్ సైన్యం సోమవారమే ప్రకటించింది. ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి మొదలుపెట్టిన రోజే ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను, క్షిపణి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని.. వాటిని తీవ్రంగా బలహీనం చేసిన సంగతి తెలిసిందే మంగళవారంనాడు ట్రంప్ సైతం.. ఇరాన్ గగనతలంపై తమకు పూర్తి నియంత్రణ ఉందని ప్రకటించారు. అంటే.. అమెరికా బీ2 బాంబర్లకు మార్గం సుగమమైనట్టే. అదే జరిగితే.. ఈ యుద్ధంలో అమెరికా కూడా అడుగుపెట్టినట