Share News

Donald Trump: మా దాడి మాత్రం 'అత్యంత వేగంగా, దుర్మార్గంగా, తియ్యగా' ఉంటుంది: ట్రంప్

ABN , Publish Date - Nov 02 , 2025 | 07:52 AM

యుద్ధానికి సిద్ధం కావాలంటూ మిలటరీకి కూడా ఆదేశాలిచ్చేశారు డోనాల్డ్ ట్రంప్. తనదైన స్టైల్లో సందేశమిచ్చారు. ఏదైనా అమెరికా దాడి మాత్రం 'అత్యంత వేగంగా, దుర్మార్గంగా, తియ్యగా" ఉంటుందని హెచ్చరించారు.

Donald Trump: మా దాడి మాత్రం 'అత్యంత వేగంగా, దుర్మార్గంగా, తియ్యగా' ఉంటుంది: ట్రంప్
Donald Trump-Nigeria

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, నైజీరియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నైజీరియాకు అందిస్తున్న సాయంలో కోత పెడతామని, అవసరమైతే సైనిక చర్య తీసుకుంటామని హెచ్చరించారు. క్రైస్తవుల హత్యలకు వ్యతిరేకంగా చర్య తీసుకోకపోతే నైజీరియాకు అమెరికా అన్నిరకాల సాయాలు నిలిపివేస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు.


నైజీరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు క్రైస్తవులపై హత్యలు కొనసాగిస్తే, అమెరికా 'తుపాకుల దాడి'కి దిగుతుందని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.'నైజీరియా ప్రభుత్వం క్రైస్తవులను చంపడానికి అనుమతిస్తూనే ఉంటే, అమెరికా వెంటనే నైజీరియాకు అన్ని సహాయసహకారాలు నిలిపివేస్తుంది.. అంతేకాదు, ఇప్పుడు ఆ అవమానకరమైన దేశంలోకి వెళ్లి, ఈ భయంకరమైన దారుణాలకు పాల్పడుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం ఉంది' అని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


అంతటితో ఆగని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. యుద్ధానికి సిద్ధం కావాలంటూ అమెరికా మిలటరీకి కూడా ఆదేశాలిచ్చేశారు. అంతేకాదు తనదైన స్టైల్లో కూడా వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఏదైనా అమెరికా దాడి మాత్రం 'అత్యంత వేగంగా, దుర్మార్గంగా, తియ్యగా" ఉంటుందని హెచ్చరించారు ట్రంప్.


ఇవి కూడా చదవండి..

PM Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి

Indias Heaviest Communication Satellite: ఇస్రో భారీ ప్రయోగం

Updated Date - Nov 02 , 2025 | 07:55 AM