Trump Harvard clash: పన్ను మినహాయింపు హోదా తొలగిస్తా
ABN , Publish Date - May 04 , 2025 | 05:09 AM
హార్వర్డ్ యూనివర్సిటీ పన్ను మినహాయింపు హోదాను తొలగిస్తానని ట్రంప్ హెచ్చరించారు. క్యాంపస్ విధానాల్లో సంస్కరణలకు హార్వర్డ్ నిరాకరించడమే ఆయన ఆగ్రహానికి కారణమని చెబుతున్నారు.
హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ తాజా హెచ్చరిక
వాషింగ్టన్, మే 3: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హార్వర్డ్ వర్సిటీపై దాడిని తీవ్రతరం చేశారు. ఆ యూనివర్సిటీ పన్ను మినహాయింపు హోదాను తొలగిస్తానని తాజాగా హెచ్చరించారు. ఆ వర్సిటీకి ఇదే తగిన మూల్యం అంటూ శుక్రవారం ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఇప్పటికే యూనివర్సిటీల వ్యవహారాల్లో ట్రంప్ జోక్యాన్ని ఈశాన్య అమెరికాలోని ఎనిమిది ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన ‘ఐవీ లీగ్ స్కూల్’ ఖండించింది. ఐవీ లీగ్ స్కూల్స్‌కు పన్ను రహిత స్థితిని మార్చేస్తానని ట్రంప్ ప్రకటించిన కొన్ని వారాల తర్వాత తాజా హెచ్చరిక వెలువడటం గమనార్హం. ట్రంప్ తాజా ప్రకటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. క్యాంపస్ విధానాల్లో సంస్కరణలు చేపట్టేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ నిరాకరించడమే ట్రంప్ ఆగ్రహానికి కారణం. కాగా, పన్ను మినహాయింపు హోదా తొలగించడం సుదీర్ఘ ప్రక్రియ అని, ఇప్పట్లో సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. కోర్టుల్లో అవరోధాలను దాటుకొని వెళ్లే సరికి సంవత్సరాలు పడుతుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..