Share News

Donald Trump: హార్వర్డ్ యూనివర్శిటీతో గొడవ.. ట్రంప్ కీలక ప్రకటన

ABN , Publish Date - Jun 21 , 2025 | 09:53 PM

Donald Trump: ఈ నేపథ్యంలోనే ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీతో ట్రంప్ ప్రభుత్వం గొడవకు దిగింది. యూనివర్శిటీకి దాదాపు 2 బిలియన్ డాలర్ల గ్రాంట్లను నిలిపివేసింది.

Donald Trump: హార్వర్డ్ యూనివర్శిటీతో గొడవ.. ట్రంప్ కీలక ప్రకటన
Donald Trump:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘నేను మోనార్క్‌ని.. నన్నెవరూ మోసం చేయలేరు’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల వారిని చూస్తే చాలు కన్నెర్ర చేస్తున్నారు. విద్యార్థులను కూడా వదలటం లేదు. అంతేకాదు..తనకు నచ్చని పని చేసే వారిపై, సంస్థలపై ఆఖరికి విద్యాలయాలపై కూడా ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీతో ట్రంప్ ప్రభుత్వం గొడవకు దిగింది. యూనివర్శిటీకి దాదాపు 2 బిలియన్ డాలర్ల గ్రాంట్లను నిలిపివేసింది.


అంతర్జాతీయ విద్యార్థులను యూనిర్శిటీలో చేర్చుకోకుండా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి హార్వర్డ్ యూనివర్శిటీ, ట్రంప్ ప్రభుత్వం మధ్య న్యాయపరమైన యుద్ధం నడుస్తోంది. హార్వర్డ్ యూనివర్శిటీతో వివాదాలపై ట్రంప్ తాజాగా స్పందించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ‘"హార్వర్డ్ యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకల గురించి చాలా మంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


ఈ అంశంపై మేము పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాము. హార్వర్డ్ యూనివర్శిటీతో చర్చలు జరుగుతున్నాయి. వచ్చే వారంలో ఓ ఒప్పందం జరిగే అవకాశం ఉంది. హార్వర్డ్ యూనివర్శిటీతో సెటిల్‌మెంట్ జరిగితే అదో చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. మన దేశానికి ఎంతో మేలు జరుగుతుంది’ అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

రూ. 500 లంచం.. 30 ఏళ్ల తర్వాత రైతుకు న్యాయం..

తప్ప తాగి ఒంటెపై సవారీ.. మృత్యు దారిలో పరుగో పరుగు..

Updated Date - Jun 21 , 2025 | 09:53 PM