Trump Tariffs: ట్రంప్ సుంకాలకు మళ్లీ ఓకే
ABN , Publish Date - May 31 , 2025 | 05:56 AM
ట్రంప్ విధించిన సుంకాలను ట్రేడ్ కోర్టు రద్దు చేసినా, అప్పీల్ కోర్టు వాటిని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ట్రంప్ సర్కారు సుంకాల వసూలు కొనసాగించేందుకు మార్గం ఏర్పడింది.
టారి్‌ఫలను ఆపాలన్న ట్రేడ్ కోర్టు తీర్పును తాత్కాలికంగా నిలిపివేసిన అప్పీల్ కోర్టు
వాషింగ్టన్, మే 30: ట్రంప్ టారి్‌ఫల వ్యవహారం మరో మలుపు తిరిగింది. వివిధ దేశాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలను నిలిపివేస్తూ ట్రేడ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కోర్టు స్టే ఇచ్చింది. ట్రంప్ సర్కారు సుంకాల వసూలు కొనసాగించేందుకు మార్గం సుగమం చేసింది. తాము తిరిగి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ స్టే అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరిట వివిధ దేశాలపై భారీగా సుంకాలను ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా ఉత్పత్తులపై ఆయా దేశాలు భారీగా సుంకాలు వసూలు చేస్తున్నాయని, దానికి ప్రతిగా తాము సుంకాలు విధిస్తున్నామని ఆయన ప్రకటించారు. అమెరికా ‘అంతర్జాతీయ అత్య వసర ఆర్థిక అధికారాల చట్టం-1977’ కింద అధ్యక్షుడికి దఖలు పడిన అధికారాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అక్కడి ‘కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్’లో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన ట్రేడ్ కోర్టు.. ట్రంప్ సుంకాలను నిలిపివేస్తూ తీర్పిచ్చింది. దీనిపై ట్రంప్ సర్కారు ‘ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు’లో అప్పీలు చేసింది. ట్రేడ్ కోర్టు తీర్పును నిలిపివేయాలని కోరింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న అప్పీల్స్ కోర్టు.. ట్రేడ్ కోర్టు తీర్పును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ‘చాలా టెరిఫిక్’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. ‘ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. డోగ్ బాధ్యతల నుంచి మస్క్ తప్పుకొన్న నేపథ్యంలో శుక్రవారం ట్రంప్ ఆయన సేవలను కొనియాడారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News