Share News

Trump: భారత్‌, పాక్‌ కలిసి డిన్నర్‌ చేయాలి!

ABN , Publish Date - May 15 , 2025 | 05:18 AM

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమని పదే పదే చెప్పుకొంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. మరోసారి ఇదే విషయం చెప్పారు.

Trump: భారత్‌, పాక్‌ కలిసి డిన్నర్‌ చేయాలి!

  • రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను

న్యూయార్క్‌/లండన్‌ మే 14: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమని పదే పదే చెప్పుకొంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. మరోసారి ఇదే విషయం చెప్పారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం రాకుండా తన మధ్యవర్తిత్వం దోహదపడిందని అన్నారు. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే భారత్‌, పాకిస్థాన్‌ కలిసి డిన్నర్‌ చేయాలని సూచించారు.


ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ట్రంప్‌.. మంగళవారం రియాధ్‌లో జరిగిన సౌదీ-అమెరికా ఇన్వె్‌స్టమెంట్‌ ఫోరం సదస్సు సందర్భంగా మాట్లాడారు. భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం జరిగి ఉంటే లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారని, అలాంటిది జరగకూడదనే తాను కోరుకున్నానని తెలిపారు. తనకు తాను శాంతిదూతగా ట్రంప్‌ చెప్పుకొన్నారు.

Updated Date - May 15 , 2025 | 07:47 AM