Share News

Donald Trump: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్‌కు ట్రంప్ కీలక సూచన

ABN , Publish Date - Jun 16 , 2025 | 11:03 PM

జీ7 సమావేశాలకు హాజరైన డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ ఓడిపోతోందని అన్నారు. పరిస్థితులు చేయి దాటక ముందే వెనక్కు తగ్గితే మంచిదని హితవు పలికారు.

Donald Trump: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్‌కు ట్రంప్ కీలక సూచన
Donald Trump

ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్ ఓడిపోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పరిస్థితి చేయి దాటక ముందే వెనక్కు తగ్గితే మంచిదని వ్యాఖ్యానించారు. కెనడాలో జీ7 దేశాల సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. అమెరికాకు సంబంధించిన ఆస్తులపై కూడా దాడికి దిగొద్దని హెచ్చరించారు. ఏ రూపంలో ఏ స్థాయిలో తమపై దాడి జరిగినా అమెరికా దళాల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. మునుపెన్నడూ చూడని స్థాయిలో అమెరికా ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ప్రాసెసింగ్ యూనిట్‌పై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్‌ను కట్టడి చేసేందుకు ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఈ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.


ఇదిలా ఉంటే, ఆపరేషన్‌ రైజింగ్ లయన్‌కు ప్రతి చర్యగా ఇరాన్ కూడా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరిట దాడులు ప్రారంభించింది. శనివారం నుంచి ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేస్తోంది. సోమవారం కూడా ఇరు దేశాలు పరస్పర మిసైల్ దాడులను కొనసాగించాయి. ఇక ఇజ్రాయెల్‌పై మునుపెన్నడూ చూడని తీవ్ర స్థాయిలో మిసైల్ దాడులకు ఇరాన్ సిద్ధమవుతున్నట్టు అక్కడి ప్రభుత్వ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ ప్రభుత్వ టీవీ స్టూడియో కార్యాలయంపై ఇజ్రాయెల్ మిసైల్ దాడికి దిగిన దృశ్యాలు కూడా వైరల్‌గా మారాయి. ఛానల్‌లోని యాంకర్ వార్తలు చదువుతున్న సమయంలో దాడి జరగడంతో ఆమె ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయిన దృశ్యాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.


ఇవీ చదవండి:

పాక్ ప్రకటనలు అవాస్తవం.. దసో ఏవియేషన్ స్పష్టీకరణ

36 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. యోచనలో అమెరికా

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 12:04 AM