విమానం ఎక్కించి కాళ్లు చేతులకు సంకెళ్లు వేశారు
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:10 AM
నా అమెరికా కల చెదిరిపోయింది. ఏజెంట్లు నిండా మోసం చేశారు. రూ.40 ల క్షలు తీసుకుని, అమెరికాకు పంపిస్తున్నామంటే.. అంతా సక్రమంగా ఉంటుందనుకున్నా. అప్పుచేసి, డబ్బులిచ్చా.

నా అమెరికా కల చెదిరిపోయింది. ఏజెంట్లు నిండా మోసం చేశారు. రూ.40 ల క్షలు తీసుకుని, అమెరికాకు పంపిస్తున్నామంటే.. అంతా సక్రమంగా ఉంటుందనుకున్నా. అప్పుచేసి, డబ్బులిచ్చా. ఐరోపాకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి బ్రెజిల్‌కు.. ఆ తర్వాత కాలినడకన అమెరికా సరిహద్దులకు చేర్చారు. 2024 జూలైలో ఐరోపాకు వెళ్తే.. ఆర్నెల్లపాటు వేర్వేరు దేశాల్లోని డంకీ మార్గాల్లో తిప్పారు. పనామా అడవుల్లోనూ గడిపాను. అమెరికా సరిహద్దు దాటగానే.. సైనికులు అరెస్టు చేశారు. చీకటి గదుల్లో ఉంచారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పరు. చివరకు అమృత్‌సర్ వచ్చేప్పుడు కూడా విమానం ఎక్కించి, కాళ్లు, చేతులకు గొలుసులతో సంకెళ్లు వేశారు. కిందకు దిగేవరకు కూడా నాకు తెలియదు.. నేను భారత్‌కు వచ్చానని..!
- జస్పాల్ సింగ్, గురుదా్‌సపూర్