Share News

Humanoid Robot Opinion On India: భారత్‌పై అభిప్రాయం అడిగిన జర్నలిస్ట్.. రోబో దిమ్మతిరిగే సమాధానం

ABN , Publish Date - Aug 31 , 2025 | 09:54 PM

ఇండియాకు చెందిన ఓ ప్రముఖ జాతీయ మీడియా జర్నలిస్ట్ ‘క్షివావ్ హ’ను ఇండియా గురించి ఓ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు ‘క్షివావ్ హ’ చెప్పిన సమాధానం విని అతడు ఆశ్చర్యపోయాడు.

Humanoid Robot Opinion On India: భారత్‌పై అభిప్రాయం అడిగిన జర్నలిస్ట్.. రోబో దిమ్మతిరిగే సమాధానం
Humanoid Robot Opinion On India

షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమిట్ దిగ్విజయంగా సాగుతోంది. భారత్, చైనా దేశాలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టాయి. రెండు దేశాలను అభివృద్ధి, శాంతి వైపు నడిపించే కీలక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మరో వైపు సమిట్‌‌లో భాగమైన హ్యూమనాయిడ్ రోబోట్ ‘క్షివావ్ హ’ తన చురుకుదనం, మేథస్సుతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ రోబోట్ సమిట్‌కు వచ్చే వారికి ఇంగ్లీష్, రష్యన్, చైనీస్ భాషల్లో సాయం చేస్తోంది. అవసరమైన సమాచారాన్ని అందిస్తోంది. జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు వారు అడిగిన భాషలో సమాధానం ఇస్తోంది.


ఇండియాకు చెందిన ఓ ప్రముఖ జాతీయ మీడియా జర్నలిస్ట్ ‘క్షివావ్ హ’ను ఇండియా గురించి ఓ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు ‘క్షివావ్ హ’ చెప్పిన సమాధానం విని అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతకు ఆ జర్నలిస్ట్ ఏం ప్రశ్న అడిగాడు? ఆ రోబోట్ ఏం సమాధానం చెప్పిందంటే.. ‘ఇండియా గురించి నువ్వేమనుకుంటున్నావు?’ అని ఆ జర్నలిస్ట్ అడిగాడు. ఇందుకు ఆ హ్యూమనాయిడ్ రోబోట్ సమాధానం ఇస్తూ.. ‘ఒక ఏఐ సర్వీస్ రోబోట్‌గా.. నేను దేశాలపై, రాజకీయాలపై వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడానికి లేదు’ అని అంది.


ఉగ్రవాదంపై పోరుకు చైనా సహకారం..

భారత దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఉగ్రవాదం ఒకటి. షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌లో ఉగ్రవాదంపై కూడా చర్చ జరిగింది. ఉగ్రవాదంపై పోరుకు తమ వంతు మద్దతు ఇస్తామని చైనా స్పష్టం చేసింది. అంతేకాదు.. రెండు దేశాల మధ్య వ్యాపారాలు మరింత పెరగాలని చైనా, భారత్‌లు ఒప్పందం చేసుకున్నాయి. అమెరికాతో రెండు దేశాలకు టారిఫ్ గొడవలు నడుస్తున్న నేపథ్యంలో దేశాధి నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దుల దగ్గర శాంతి నెలకొల్పాలని రెండు దేశాలు నిశ్చయించుకున్నాయి.


ఇవి కూడా చదవండి

కర్ణాటక సీఎంను కలిసిన రామ్ చరణ్.. కారణం ఏంటంటే..

మరీ ఇంత దారుణమా.. ఏఐ చెప్పిందని తల్లిని చంపేశాడు..

Updated Date - Aug 31 , 2025 | 09:54 PM